మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ అయితే, ఈ వార్త మీ కోసమే. సెప్టెంబర్ 30 గడువు ముగిసిన తర్వాత మీ పాన్ కార్డులు పనిచేయనివిగా ప్రకటించనున్నారు. పాన్ కార్డును (PAN)ఆధార్ కార్డుతో లింక్ చేయడంలో విఫలమైన వినియోగదారులు బ్యాంక్‌ల నుంచి పలు సమస్యలను ఎదుర్కొంటారని తెలియజేశాయి.
బ్యాంకులు కొంతకాలంగా పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయమని ఖాతాదారులను కోరుతున్నాయి. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఎస్‌బీఐ తన ఖాతాదారులకు సోషల్ మీడియాలో కూడా పలు సలహాను సూచించింది. “ఎలాంటి అసౌకర్యాలు లేకుండా, బ్యాంక్ సేవలను ఆస్వాదించడానికి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి” అని ఎస్‌బీఐ తన అధికారిక ట్విట్టర్‌లో ప్రకటించింది.
“లింక్ చేయకపోతే, ఇక నుంచి పాన్ కార్డు పనిచేయకపోవచ్చు. ఇకపై ఎలాంటి లావాదేవీలను నిర్వహించలేరు” అని పేర్కొంది. సాఫీగా బ్యాంకింగ్ సేవలను ఆస్వాదించడానికి, తన ఖాతాదారులకు ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించి పాన్ కార్డుతో ఆధార్‌ని లింక్ చేయాలని సూచించింది.
కొత్తగా ప్రారంభించిన ఇన్‌కం టాక్స్ వెబ్‌సైట్‌లో మీ పాన్ కార్డ్‌తో ఆధార్ కార్డును ఎలా లింక్ చేయాలో చూద్దాం..
1. Www.incometax.gov.in లో కొత్త ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ 2.0 ని సందర్శించండి
2. హోమ్‌పేజీని క్రిందికి స్క్రోల్ చేయండి. అక్కడ మీకు ‘లింక్ ఆధార్’ అనే ఆఫ్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
3. మరో పేజీలో అన్ని వివరాలను పూర్తిచేయాలి. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
4. ఇప్పుడు “నా ఆధార్ వివరాలను ధృవీకరిస్తున్నాను” అనే బాక్స్‌లో టిక్ చేయాలి.
5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో మీరు అందుకున్న 6 అంకెల OTPని ఇక్కడ నమోదు చేయాలి.
6. OTP నమోదు చేసి, ‘ధృవీకరించు’ పై క్లిక్ చేయండి
7. క్లిక్ చేసిన తర్వాత, ఆధార్‌తో పాన్ లింక్ చేసినట్లు పాప్-అప్ సందేశం వస్తుంది.
అయితే ఈ ప్రక్రియ సాఫీగా జరగాలంటే మాత్రం.. పాన్ కార్డుతోపాటు ఆధార్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ, జండర్‌లు ఓకేలా ఉండాలి. లేదంటే మాత్రం పాన్ కార్డుతో ఆధార్ లింక్ కాదు.
Also Read: Saffron Cultivation: ప్రయోగం సక్సెస్.. విరగబూసిన కశ్మీర్ గులాబ్.. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో..
Acharya Chanakya: నీరు.. డబ్బు.. ఒకటే.. సంపాదించిన సంపదను ఏం చేయాలో చెప్పిన చాణక్యుడు..
Gold Loan: ఈ బ్యాంకులలో గోల్డ్‌లోన్ చాలా చౌక..! తక్కువ వడ్డీ.. సులువైన వాయిదాలు..