AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అతిముఖ్యమైన విషయాలు..!

ఆర్బీఐ అంబుడ్స్‌మన్ మీ ఫిర్యాదును పరిశీలించి, అది బ్యాంక్ పొరపాటేనని నిర్ధారిస్తే కట్ అయిన పూర్తి సొమ్మును వడ్డీతో సహా మీ ఖాతాలో జమ చేయాలని బ్యాంకును ఆదేశిస్తుంది. అన్యాయంగా కస్టమర్‌ను ఇబ్బంది పెట్టినందుకు కొన్ని సందర్భాల్లో ఆందోళన కలిగించిన పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించే అవకాశం ఉంది.

Bank Account: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అతిముఖ్యమైన విషయాలు..!
చాలా కాలంగా నిలిచిపోయిన ఇటువంటి ఖాతాలను సైబర్‌ నేరగాళ్లు లేదా మోసగాళ్లు దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది. వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి, బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రమాద రహఙతంగా ఉంచడానికి బ్యాంకు ప్రక్షాళన చేపట్టింది.
Subhash Goud
|

Updated on: Sep 02, 2026 | 1:59 PM

Share

Bank Account: ఒక్కోసారి బ్యాంకులు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వకుండానే మన ఖాతా నుంచి అనవసరమైన లేదా తప్పుడు రుసుములు అంటే బ్యాక్‌ ఛార్జీలు కట్ చేస్తుంటాయి. ‘మినిమమ్ బ్యాలెన్స్ లేదు’ అనో, ‘SMS అలర్ట్ ఛార్జీలు’ అనో, లేదా సాంకేతిక లోపాల వల్ల మనకు తెలియకుండానే ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ (RBI) నిబంధనల ప్రకారం, బ్యాంక్ నుంచి మీ డబ్బులను తిరిగి పొందడానికి ఒక నిర్దిష్టమైన మార్గం ఉంది.

ఇది కూడా చదవండి: Insurance Claim: వాహనదారులకి ఊరటనిచ్చే తీర్పు.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు!

1. ముందుగా మీరు చేయాల్సిన మొదటి పని:

  • మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి లేదా బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్/ఈమెయిల్ ద్వారా తప్పుడు ఛార్జీలపై అధికారికంగా ఫిర్యాదు చేయండి.
  • బ్యాంక్ నుంచి మీకు వచ్చే ఫిర్యాదు నంబర్‌ను భద్రపరుచుకోండి.
  • సాధారణంగా బ్యాంక్ ఈ ఫిర్యాదును పరిష్కరించడానికి 30 రోజుల సమయం తీసుకుంటుంది.

2. బ్యాంక్ స్పందించకపోతే లేదా సరిగ్గా సమాధానం ఇవ్వకపోతే?:

మీరు ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా బ్యాంక్ నుంచి ఎలాంటి పరిష్కారం రాకపోయినా, లేదా బ్యాంక్ ఇచ్చే సమాధానం మీకు సంతృప్తికరంగా లేకపోయినా.. మీరు నేరుగా ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ (RBI Banking Ombudsman) ను సంప్రదించవచ్చు.

3. ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయడం ఎలా?

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన CMS (Complaint Management System) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని కల్పించింది.
  • అధికారిక వెబ్‌సైట్: https://cms.rbi.org.in ను సందర్శించండి.

ఫిర్యాదు ప్రక్రియ:

  • పోర్టల్‌లో “File a Complaint” పై క్లిక్ చేయండి.
  • మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ నమోదు చేయండి.
  • మీ సంబంధిత బ్యాంకు పేరు, మీ ఖాతా నంబర్, మీ బ్యాంక్‌కు ఇప్పటికే చేసిన ఫిర్యాదు వివరాలను నమోదు చేయండి.
  • కట్ అయిన తప్పుడు ఛార్జీలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్ ఆధారాలు అప్‌లోడ్ చేయండి.
  • చివరిగా ఫిర్యాదును సబ్‌మిట్ చేయండి.

4. హెల్ప్‌లైన్, ఈమెయిల్ మార్గాలు:

టోల్ ఫ్రీ నంబర్: మీరు ఆన్‌లైన్‌లో చేయలేకపోతే, ఆర్బీఐ కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ 14448 కి కాల్ చేసి కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈ సేవ పూర్తిగా ఉచితం. దీని కోసం వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

5. ఎంత పరిహారం/రీఫండ్ లభిస్తుంది?

ఆర్బీఐ అంబుడ్స్‌మన్ మీ ఫిర్యాదును పరిశీలించి, అది బ్యాంక్ పొరపాటేనని నిర్ధారిస్తే కట్ అయిన పూర్తి సొమ్మును వడ్డీతో సహా మీ ఖాతాలో జమ చేయాలని బ్యాంకును ఆదేశిస్తుంది. అన్యాయంగా కస్టమర్‌ను ఇబ్బంది పెట్టినందుకు కొన్ని సందర్భాల్లో ఆందోళన కలిగించిన పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించే అవకాశం ఉంది.

చివరిగా ముఖ్య గమనిక:

బ్యాంకులు చేసే ప్రతి చిన్న పొరపాటును నిర్లక్ష్యం చేయకండి. మీ అనుమతి లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా కట్ అయిన రూపాయి అయినా సరే, ప్రశ్నించి ఆర్బీఐ అంబుడ్స్‌మన్ ద్వారా తిరిగి పొందే హక్కు మీకు ఉంది.

ఇది కూడా చదవండి: Mobile Apps: ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌.. ప్రయోజనాలు తెలిస్తే వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకుంటారు!

ఇది కూడా చదవండి: మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? ఈ స్కీమ్‌లో నెలకు ఎంత పొదుపు చేస్తే పెళ్లి, చదువు నాటికి రూ.70 లక్షలు వస్తాయి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..