చాలా మందికి బ్యాంకుల్లో ఖాతా ఉంటుంది. ఈ రోజుల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ ఉంటుంది. అయితే బ్యాంకు అకౌంట్‌కు కేవైసీ ఉండటం తప్పనిసరి. కేవైసీ లేని ఖాతాలను బ్యాంకు మూసి వేస్తుంది. ఈ నేపథ్యంలో కేవైసీ లేదని ఖాతాలను స్తంభింపజేస్తున్న బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ మందలించింది. KYC లేనందున వారి ఖాతాలలో ప్రభుత్వం నుండి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) నిధులను పొందిన వ్యక్తుల ఖాతాలను బ్యాంకులు స్తంభింపజేస్తున్నాయి. ఇందులో సబ్సిడీ, పెన్షన్, ప్రత్యేక పథకం నుండి డబ్బు మొదలైనవి ఉంటాయి. ఇది కాకుండా, రిజర్వ్ బ్యాంక్ ఈ బ్యాంకులు కేవైసీ అప్‌డేట్‌ను ఆలస్యం చేసినందుకు పెనాల్టీ వేయడమో.. లేక అకౌంట్‌ను స్థంభింపజేయడమో లాంటివి చేస్తుంటాయి. దీంతో పలువురి ఖాతాలు కూడా నిలిచిపోతున్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్లను ఉద్దేశించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ మాట్లాడుతూ, బ్యాంకులు కేవైసీ మార్గదర్శకాలను ఖచ్చితత్వం, సానుభూతితో అనుసరించేలా చూసుకోవాలని అన్నారు. ఆర్‌బీఐ గతంలో కూడా బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. వీటిలో కేవైసీ లేకపోవడంతో ప్రభుత్వ పథకాల సొమ్మును బదిలీ చేసే ఖాతాలను బ్యాంకులు స్తంభింపజేయకూడదని సూచించింది. బ్యాంకు ఖాతాల విషయంలో, కేవైసీ విషయంలో వివిధ సమస్యలను తెలుసుకున్న రిజర్వ్ బ్యాంక్ పలు విషయాలను లేవనేత్తింది.
మార్గదర్శకాల అమలు తీరు వల్ల అనేక ఖాతాలు స్తంభించిపోతున్నాయని డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ అన్నారు. దీంతో ఖాతాదారులు డబ్బులు తీసుకోలేకపోతున్నారు. బ్యాంకుల సేవలో ఎలాంటి లోపం లేకుండా బోర్డులు పెట్టాలన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు మొదలైన వారికి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి