
మన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయి. ఈ నగరాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో అద్దెకు లభించే ఇళ్ల ధరలు సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. ఒక టెక్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి అద్దెల గురించి స్పందిస్తూ మతిపోగొట్టే విషయం వెల్లడించాడు. బెంగళూరులో 3 BHK ఇంటి అద్దె రూ.1 లక్షకు చేరుకుందని అన్నాడు.
సాహిల్ ఖాన్ ఒక స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బెంగళూరులో ఇల్లు వెతుకుతున్న అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కుక్ టౌన్‌లోని ఒక ఇంటి యజమాని 3 బెడ్‌రూమ్‌ల ఇల్లు కోసం రూ.లక్ష అడుగుతున్నాడని సాహిల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
సాహిల్ ఒకే రోజు ఎనిమిది ఇళ్లను సందర్శించి.. నగరంలో ఇళ్ల అద్దెలు అదుపు తప్పుతున్నాయని నాకు అర్థమైంది అని అన్నాడు. ఒక నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ రకంగా ఇళ్ల అద్దెలు పెరిగిపోతే ఇక బతికేది ఎలా అంటూ మండిపడుతున్నారు. ఇంటి రెంట్‌లను కంట్రోల్ చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి