Bajaj E-Scooter: బజాజ్ చేతక్ కొత్త లుక్ చూశారా? ఒక్క సారి చార్జ్ చేస్తే 108 కిలోమీటర్లు వెళ్తుందా? కంపెనీ చెబుతోంది ఏంటి?

బజాజ్‌ ఆటో.. చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 2023 ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మూడు కలర్లలో లభించనున్న ఈ ప్రీమియం ఈవీ ధర బెంగళూరు ఎక్స్‌షోరూం ప్రకారం రూ.1,51,910.

Bajaj E-Scooter: బజాజ్ చేతక్ కొత్త లుక్ చూశారా? ఒక్క సారి చార్జ్ చేస్తే 108 కిలోమీటర్లు వెళ్తుందా? కంపెనీ చెబుతోంది ఏంటి?
Bajaj Chetak Premium edition

Updated on: Mar 03, 2023 | 6:00 PM

ప్రస్తుత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. అన్ని దిగ్గజ కంపెనీలు ఈ డిమాండ్ కు అనుగుణంగా వివిధ మోడళ్లలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇదే క్రమంలో బజాజ్ చేతక్ కూడా తన అప్ డేటెడ్ వెర్షన్ విద్యుత్ శ్రేణి ద్విచక్ర వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతకు ముందు 2020లో ఆ సంస్థ ఈ-స్కూటర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి మరిన్ని ఫీచర్లు జోడిస్తూ ఆ కంపెనీ తాజాగా ఓ మోడల్ తీసుకువచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

ధర ఎంతంటే..

బజాజ్‌ ఆటో.. చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 2023 ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మూడు కలర్లలో లభించనున్న ఈ ప్రీమియం ఈవీ ధర బెంగళూరు ఎక్స్‌షోరూం ప్రకారం రూ.1,51,910. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చేతక్‌ ధర రూ.1,21,933గా ఉన్నది. సరికొత్త ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఈ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను బజాజ్‌ ఆటో తీసుకొచ్చింది.

మూడు కలర్లలో..

బజాజ్ కంపెనీ ఈ కొత్త వేరియంట్ ని మూడు కలర్ ఆప్షన్స్ లో విడుదల చేసింది. అవి మాట్ కోర్స్ గ్రే, మాట్ కరేబియన్ బ్లూ, శాటిన్ బ్లాక్ కలర్స్. అంతే కాకుండా ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ సీటు, బాడీ కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, శాటిన్ బ్లాక్ గ్రాబ్ రైల్, మ్యాచింగ్ పిలియన్ ఫుట్ రెస్ట్ కాస్టింగ్స్, హెడ్ ల్యాంప్ కేసింగ్, బ్లింకర్లు వంటివి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

బుకింగ్ ప్రారంభం..

మన దేశంలో ఈ కొత్త బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

బ్యాటరీ ప్యాక్ లో మార్పు లేదు..

బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ డిజైన్, ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ బ్యాటరీ ప్యాక్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి అప్డేట్ లేదు. కావున ఇందులో అదే 2.9 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 4.2కిలోవాట్ల పీక్ వర్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది ఒక సారి చార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తుంది. అయితే ఇటీవల చేతక్ ప్రకటించిన విధంగా ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ లో స్కూటర్ మైలేజీని 20 శాతం మేర పెంచి 108 కిలోమీటర్లకు చేర్చితే ఇది ఓలా స్కూటర్ కు పోటీ కాగలదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..