Saving schemes: మధ్యతరగతికి మరో ఝులక్! ఈసారీ సారి అంటున్నకేంద్రం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఈ ఆర్థిక సంవ్సతరం(2023-24)లోని మొదటి క్వార్టర్ ఏప్రిల్ నుంచి జూన్ వరకూ కూడా ఈ వడ్డీ రేటులో ఎటువంటి మార్పు ఉండబోదని కొన్ని నివేదికల ప్రకారం తెలుస్తోంది. ఇదే జరిగితే మరోసారి మధ్య తరగతి ప్రజలకు కేంద్ర షాక్ ఇచ్చినట్టే చెప్పుకోవాలి.

Saving schemes: మధ్యతరగతికి మరో ఝులక్! ఈసారీ సారి అంటున్నకేంద్రం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
PPF, SSY Schemes

Updated on: Mar 12, 2023 | 1:00 PM

సురక్షిత పెట్టుబడి పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) ముందుంటుంది. అలాగే ఆడ పిల్లల భవిష్యత్తు సంరక్షణ కోసం నిర్దారించిన సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్ వై) పథకంపై కూడా ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. ఈ రెండు కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుండటంతో ప్రజలకు నమ్మకం ఏర్పడింది. వీటిల్లో మిగిలిన పథకాలతో పోల్చితే కాస్త వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది. అయితే గత 12 క్వార్టర్లుగా ఈ వడ్డీ రేటును కేంద్రం మార్చడం లేదు. ఈ ఆర్థిక సంవ్సతరం(2023-24)లోని మొదటి క్వార్టర్ ఏప్రిల్ నుంచి జూన్ వరకూ కూడా ఈ వడ్డీ రేటులో ఎటువంటి మార్పు ఉండబోదని కొన్ని నివేదికల ప్రకారం తెలుస్తోంది. ఇదే జరిగితే మరోసారి మధ్య తరగతి ప్రజలకు కేంద్ర షాక్ ఇచ్చినట్టే చెప్పుకోవాలి. చాలా మంది మధ్యతరగతి వారు పోస్ట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఈ రెండు పథకాలలో పెట్టుబడులు పెట్టుకున్నారు.

గతేడాది డిసెంబర్ 30న ఫైనాన్స్ మినిస్ట్రీ నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్(ఎన్ఎస్ఎస్ఎఫ్) పథకాల వడ్డీ రేట్లను 20 బేస్ పాయింట్ల(బీపీఎస్) పెంచి 110 బీపీఎస్ చేసింది. అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ అందిందే ప్రధాన పొదుపు పథకాలైన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లు మాత్రం పెంచలేదు.

2021 లో తగ్గించారు.. మళ్లీ పెంచలేదు..

2021-22 ఆర్థిక సంవ్సతరం మొదటి క్వార్టర్ లో కేంద్ర ప్రభుత్వం అప్పటి పరిస్థితులను బట్టి పీపీఎఫ్, సుకన్య సమృద్ధి పథకాల వడ్డీ రేట్లను తగ్గించింది. 7.9శాతం ఉన్న పీపీఎఫ్ వడ్డీని 7.1శాతానికి, 8.4 ఉన్న సుకన్య సమృద్ధి పథక వడ్డీని 7.6శాతానికి తగ్గించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మళ్లీ ఎటువంటి పెంపు లేదు.

ఇవి కూడా చదవండి

ఎందుకు పెరగడం లేదు..

అన్ని జాతీయ పొదుపు పథకాలకు వడ్డీ రేట్లలో మార్పుకనిపిస్తున్నా.. పీపీఎఫ్, సుకన్య పథకాలకు మాత్రం వడ్డీ రేట్లు పెరగడం లేదు. దీనికి ప్రధాన కారణం ఈ పథకాలకు ఉన్న ట్యాక్స్ బెనిఫిట్సేనని నిపుణులు చెబుతున్నారు. ఇతర పొదుపు ఉత్పత్తులతో పోలిస్తే ఈ రెండు స్కీమ్‌ల నుండి వచ్చే రాబడులు ఎక్కువగా ఉంటాయని.. వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు దీనిని గుర్తుంచుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, జూన్ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు రేట్లను ఈ నెలాఖరులోగా ప్రభుత్వం నోటిఫై చేసే అవకాశం ఉందని, కానీ వీటిల్లో పీపీఎఫ్, సుకన్య పథకాల రేట్లలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..