
బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. రోజురోజుకూ బంగారం, వెండి ఖరీదైనవి మారుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బల్గేరియాకు చెందిన బాబా వంగా అంచనాలు మరోసారి చర్చనీయాశంగా మారాయి. బంగారం ధరల గురించి బాబా వంగా గతంలోనే అంచనా వేశారు. ఆ అంచనాను ఇప్పుడు తెలుసుకొని చాలా మంది షాక్ అవుతున్నారు. ఎందుకంటే వంగా అంచనాలు అక్షరాల నిజమయ్యాయి. బంగారం ధర ఎంత పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుందనే దాని గురించి బాబా వంగా అప్పుడే చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.
బంగారం ధర గురించి బాబా వెంగా చెప్పిన అంచనా వైరల్ గా మారింది. ఈ అంచనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బంగారం ధర ఎక్కువగా ఉంది. బాబా వంగా అంచనా గురించి తెలుసుకున్న బంగారం ఎక్కువగా ఉన్నవారు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఎందుకంటే ఆమె అంచనా ప్రకారం బంగారం ధరలు మరింత పెరగనున్నాయి.
మన దేవంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు లక్ష 47 వేల రూపాయలకు చేరుకుంది. బాబా వంగా అంచనా ప్రకారం.. ఆర్థిక సంక్షోభం సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు. దీని కారణంగా చాలా మంది బంగారం, వెండిలో మరింత ఎక్కువగా పెట్టుబడి పెడతారు. దీంతో బంగారం ధర దాదాపు 25 నుండి 40 శాతం పెరగవచ్చు. ప్రస్తుతం బంగారం ఒకటిన్నర లక్షల రేంజ్‌లో ఉంది. ఈ ధర రెండు లక్షలకు పెరుగుతుందనే అభిప్రాయాలను నేటి ఆధునిక ఆర్థిక వేత్తలు కూడా వెల్లడిస్తారు. వీటికి బాబా వంగా అంచనాలు కూడా తోడు కావడంతో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కచ్చితంగా ఉందని, బాబా వంగా అంచనాలను నమ్మే వారు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి