
కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2025లో బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపించింది. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధర 10 గ్రాములకు లక్ష దాటేసింది. మరి 2026లో బంగారం ధర ఎలా ఉండబోతుంది. ప్రస్తుత ధర నుంచి కిందికి దిగి వస్తుందా? ఇంక పెరిగిపోతుందా? అసలు ప్రపంచ ప్రఖ్యాత బాబా వెంగా దీనికి గురించి ఎలాంటి అంచనాలను వెల్లడించారనే చాలా మందిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాబా వంగాను బాల్కన్ల నోస్ట్రాడమస్ అని పిలుస్తారు. బాబా వంగా అంచనా ప్రకారం ప్రపంచ ఆర్థిక మార్పులు 2026లో ఆర్థిక సంక్షోభానికి కారణం కావచ్చు. ఇది సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు. ఈ సంక్షోభం బ్యాంకింగ్ సంక్షోభానికి దారితీస్తుంది, కరెన్సీ విలువను బలహీనపరుస్తుంది. ఈ సంక్షోభం బంగారం, వెండి ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది.
ఆర్థిక సంక్షోభం బంగారం, వెండి ధరలలో భారీ పెరుగుదలకు కారణమవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతాయి. అందువల్ల వచ్చే ఏడాది బంగారం ధర 25 నుండి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని బాబా వంగా వేసిన అంచనాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. 2026 లో ప్రజలు అనేక వినాశకరమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే అవకాశం ఉందని బాబా వంగా ఒక ప్రధాన అంచనాను కూడా వేశారు. AI మరింత శక్తివంతమవుతుందని, ఇది మానవ జీవితానికి ముప్పు కలిగిస్తుందని కూడా ఆమె అన్నారు.
బాబా వంగా ఇప్పటివరకు చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి. అందుకే ఇప్పుడు కొత్త ఏడాది గురించి, ఆర్థిక సంక్షోభం గురించి ఆమె బతికున్న సమయంలోనే చెప్పిన విషయాలు ఇప్పుడు అందరిని భయపెడుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి