Axis Bank: తగ్గేదె లే అంటున్న యాక్సిస్ బ్యాంక్.. అమెరికా దిగ్గజ కంపెనీ వ్యాపారం కొనుగోలు

|

Mar 31, 2022 | 9:47 AM

Axis Bank: భారత ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ మరో భారీ వ్యాపార్ డీల్ చేసుకుంది. ఈ సారి అమెరికాకు చెందిన దిగ్గజ బ్యాంక్‌కు సంబంధించిన భారత వ్యాపారాన్ని కొనేందుకు ముంగుకొచ్చింది.

Axis Bank: తగ్గేదె లే అంటున్న యాక్సిస్ బ్యాంక్.. అమెరికా దిగ్గజ కంపెనీ వ్యాపారం కొనుగోలు
Axis Bank
Follow us on

Axis Bank: భారత ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ మరో భారీ వ్యాపార్ డీల్ చేసుకుంది. ఈ సారి అమెరికాకు చెందిన దిగ్గజ బ్యాంక్‌కు సంబంధించిన భారత వ్యాపారాన్ని కొనేందుకు ముంగుకొచ్చింది. తన భారత విభాగానికి చెందిన వ్యాపారాన్ని సిటీ బ్యాంక్‌(Citi bank) కొంత కాలం కిందట నిర్ణయించింది. ఈ కంపెనీకి చెందిన కన్జూమర్ బిజినెస్(consumer business) లోని.. క్రెడిట్‌ కార్డు, రిటైల్‌ బ్యాంకింగ్‌, కన్జూమర్‌ లోన్‌, వెల్త్‌ మేనేజ్‌మెమెంట్‌ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ విభాగాల్లోని వ్యాపారాలను రూ.12,325 కోట్లకు యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ డీల్ ద్వారా సిటీ బ్యాంక్‌కు చెందిన 30 లక్షల మంది క్రెడిట్‌ కార్డు కస్టమర్లు యాక్సిస్‌ బ్యాంక్ వినియోగదారులుగా మారనున్నారు. దీనివల్ల కంపెనీ క్రెడిట్‌ కార్డు పోర్ట్‌ఫోలియో 31 శాతం మేర వృద్ధి చెందనుంది. ఈ డీల్ వల్ల భారత బ్యాంకింగ్ రంగంలో మరో భారీ డీల్ జగిగినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఒక డీల్ ద్వారా కార్వీ కంపెనీకి చెందిన డీమాట్ అకౌంట్లను దక్కించున్న యాక్సిస్ బ్యాంక్ మరో సారి భారీ వ్యాపార విస్తరణ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

ఈ డీల్‌లో భాగంగా ఇండియాలోని సిటీ బ్యాంక్‌ చెందిన.. 7 కార్యాలయాలు, 21 శాఖలు, 18 నగరాల్లో ఉన్న 499 ఏటీఎంలు యాక్సిస్‌ బ్యాంక్‌ సొంతం కానున్నాయి. కన్జూమర్‌ బ్యాంకింగ్‌లో పనిచేస్తున్న 3,600 మంది ఉద్యోగులు ఇకపై యాక్సిన్‌ బ్యాంక్‌ ఉద్యోగులుగా మారతారు. అంతర్జాతీయ వ్యూహంలో భాగంలో భారత్‌లోని బ్యాంకింగ్‌ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు 2021 ఏప్రిల్‌లో సిటీ బ్యాంక్‌ ప్రకటించింది. 1902లో భారత్‌లోకి ప్రవేశించిన సిటీ బ్యాంక్.. 1985లో బిజినెస్‌ను ప్రారంభించింది. వినియోగదారు వ్యాపారం నుంచి వైదొలిగిన సిటీ గ్రూప్‌.. ఇకపై ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్‌ నుంచి గ్లోబల్‌ వ్యాపారంపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

KTR: అక్కడ ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు ఆహ్వానం.. అర్సెలార్‌ మిత్తల్‌ సంస్థతో కేటీఆర్ చర్చలు

Multibagger Returns: ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన టాటా షేర్.. 2 ఏళ్లలో మంచి రిటర్న్స్..

Anand Mahindra: ఒలింపిక్స్ కి వెళితే అతనికి మెడల్ పక్కా.. టాలెంట్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్..