ఇప్పుడంతా ఎలక్ట్రిక్ స్కూటర్ల కాలం నడుస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల బడ్జెట్‌పై అధిక ప్రభావం పడుతోంది. దాంతో ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఉన్న బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ వాడకాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని కూడా అందించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలు భారీగా పెరిగింది. అయితే, చాలా మంది ఎక్కువ రేంజ్ వచ్చే బైక్‌లను కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. అధిక రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వలన ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. మధ్యలో ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు. మార్కెట్‌లో అధిక రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్స్ వివరాలు మీకోసం.. ఈ బైక్స్ ఒకసారి చార్జ్ చేస్తే.. 212 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తాయి. ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌లతో కూడిన 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను ఇప్పుడు చూద్దాం..
సింపుల్ వన్: సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీ డిమాండ్‌కు తగ్గట్లుగా అధిక రేంజ్ ఇస్తుంది. ఇది ఒకటి కాదు రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. వీటిలో ఒకటి పర్మనెంట్ బ్యాటరీ, మరొకటి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. బ్యాటరీ ప్యాక్ మొత్తం శక్తి 5kWh. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 212 కిలోమీటర్లు వస్తుంది.
Ola ఇటీవలే Ola S1 Pro Gen 2ని విడుదల చేసింది. ఇది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అప్‌డేట్ వెర్షన్. ఇది 4kWh బ్యాటరీ ప్యాక్ శక్తిని పొందుతుంది. Ola S1 Pro Gen 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 195 కిలోమీటర్లు రేంజ్ వస్తుంది.
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా ఎస్1 ప్రో ఒకటి. ఇందులో అద్భుతమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉన్నాయి. Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 4kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 181 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది.
భారతీయ మార్కెట్‌లో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయిస్తోంది. Vida V1 Pro 3.94kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. కంపెనీ అధికారిక వివరాల ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్లు వస్తుంది.
Ather 450X Gen 3 చాలా శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నిర్మాణ నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.7kWh బ్యాటరీ ప్యాక్ శక్తిని పొందుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ వస్తుందని కంపెనీ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లి్క్ చేయండి..