Syndicate Customers: సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. జూలై 1నుంచి అమల్లోకి సరికొత్త IFSC కోడ్ .. తెలుసుకోవడం ఎలా అంటే..

|

Jun 09, 2021 | 12:15 PM

Syndicate Customers: 1925లో కర్ణాటక రాష్ట్రములోని ఉడిపి లో సిండికేట్ బ్యాంకు స్థాపించబడింది. క్రిందివర్గాల వారికి ఆర్థిక సహాయం అందజేయడం అనే లక్ష్యంతో ప్రారంభమైన..

Syndicate Customers: సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. జూలై 1నుంచి అమల్లోకి సరికొత్త IFSC కోడ్ .. తెలుసుకోవడం ఎలా అంటే..
Syndicate Bank
Follow us on

Syndicate Customers: 1925లో కర్ణాటక రాష్ట్రములోని ఉడిపి లో సిండికేట్ బ్యాంకు స్థాపించబడింది. క్రిందివర్గాల వారికి ఆర్థిక సహాయం అందజేయడం అనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ బ్యాంక్ మొదట ఏజెంట్ల ను నియమించుకుని.. వారి ద్వారా ఇంటింటికీ త్రిప్పించి రెండు అణాల పొదుపులను కూడా స్వీకరించింది. అలా మొదలైన సిండికేట్ బ్యాంక్ ప్రస్థానం.. ఇటీవల ఆర్ధిక సంస్కరణలో భాగంగా కెనరా బ్యాంకులో విలీనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిండికేట్ బ్యాంక్ వినియోగదారులకు కెనరా బ్యాంక్ కీలక హెచ్చరిక జారీ చేసింది.

బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంకుగా మారింది. ఈ నేపథ్యంలో సిండికేట్ బ్యాంకుకు సంబంధించిన IFSC కోడ్ జూలై 1, 2021 నుంచి పని చేయదని కెనరా బ్యాంక్ స్పష్టం చేసింది. SYNB తో ప్రారంభమయ్యే 11-అంకెల IFSC కోడ్ జూలై 1 నుండి డియాక్టివేట్ చేయబడుతుందని ప్రకటించింది.

అంతేకాదు జూలై 1 నుంచి సిండికేట్ సిండికేట్ ఖాతాదారులు కొత్త ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ వాడాల్సి  ఉందని తెలిపింది. జూలై 1 నుంచి  NEFT / RTGS / IMPS సేవలు వినియోగించే సమయంలో CNRB తో ప్రారంభమయ్యే IFSC కోడ్‌ను ఉపయోగించాలని  వినియోగదారులకు సూచించింది. అయితే  IFSC కోడ్‌ ను తెలుసుకోవడానికి సంబంధిత బ్రాంచ్ కు వెళ్లవచ్చునని.. లేదా  కెనరా బ్యాంక్ వెబ్‌సైట్‌  ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపింది.

Also Read: కరోనా విషయంలోనూ ప్రత్యేక చాటుకున్న గిరిజనులు.. స్మశానాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్న వైనం..