ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం.. మీరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

అటల్ పెన్షన్ యోజన ద్వారా రోజువారీ కూలీలు, రైతులు, చిన్న వ్యాపారులు 60 ఏళ్లు దాటాక నెలకు రూ.1,000 నుండి రూ.5,000 వరకు ప్రభుత్వం ద్వారా పెన్షన్ పొందవచ్చు. 18-40 ఏళ్ల వయస్సుల వారు ఈ స్కీమ్‌కు అర్హులు. అక్టోబర్ 2022 నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు.

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం.. మీరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Pension

Updated on: Nov 11, 2026 | 10:12 PM

అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, రోజువారీ కూలీలు, వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారులు, సాధారణ పౌరులకు 60 ఏళ్లు దాటిన తర్వాత స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందించేందుకు అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.వెయ్యి నుండి రూ.5 వేల వరకు  పెన్షన్ పొందవచ్చు. చిన్న మొత్తాల పొదుపుతో వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కోరుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.  ఈ స్కీములో చేరేందుకు వయస్సు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉన్నారు. భారతీయ పౌరులు మాత్రమే ఈ పథకంలో చేరేందుకు అర్హులు. లబ్ధిదారులకు తప్పనిసరిగా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉండాలి. ఈ ఖాతా ద్వారానే ఆటోమేటిక్‌గా ప్రీమియంలు డెబిట్ అవ్వడంతో పాటు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ క్రెడిట్ అవుతుంది.  ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకంలో చేరడానికి అనర్హులు. ఇప్పటికే పథకంలో చేరిన ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ నిబంధన వర్తించదు.

కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇతర పథకాల కింద పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ పథకంలో చేరేందుకు అనర్హులు. ఈ పథకంలో ప్రీమియం ఎంతనేది లబ్ధిదారుడు చేరే వయస్సుతో పాటు ఎంత నెలవారీ పెన్షన్ పొందాలనుకు దానిని బట్టి ఉంటుంది. తక్కువ వయస్సులో చేరితే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ వయస్సులో చేరితే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.  18 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.42 నుండి రూ.210 వరకు ప్రీమియం ఉంటుంది. 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.291 నుండి రూ.1,454 వరకు ప్రీమియం ఉంటుంది. ప్రీమియం చెల్లింపులు నెలవారీగా, మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి చెల్లించే ఆప్షన్ ఉంటుంది. ఆటో డెబిట్ సౌకర్యం ద్వారా ప్రీమియంలు మీ బ్యాంకు ఖాతా నుండి నేరుగా డెబిట్ అవుతాయి.  60 ఏళ్లు నిండిన తర్వాత, మీరు ఎంచుకున్న పెన్షన్ ప్రతీ నెలా అందుతుంది.

ఒకవేళ లబ్ధిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామి లేదా నామినీకి వారి జీవితకాలం వరకు పెన్షన్ లభిస్తుంది. లబ్ధిదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణిస్తే అప్పటి వరకు జమ అయిన మొత్తం కార్పస్ నామినీకి అందజేస్తారు. అందుకే పథకంలో చేరేటప్పుడు నామినీ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. ఈ పథకంలో చేరేందుకు ఏదైనా బ్యాంక్ బ్రాంచ్, పోస్ట్ ఆఫీస్ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించాలి. ప్రీమియం చెల్లింపులో జాప్యం జరిగితే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలల పాటు ప్రీమియం చెల్లించకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us