Credit Card Limit: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? కార్డు లిమిట్‌ పెంచుకుంటే లాభమా… నష్టమా..?

|

Mar 27, 2021 | 5:20 PM

Credit Card Limit: అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేది క్రెడిట్‌ కార్డులు. కానీ అనవసరంగా ఖర్చు చేస్తూ సమయానికి చెల్లించని సమయంలో మాత్రం పెనాల్టీ ఛార్జీల మోత మోగుతుంటుంది.

Credit Card Limit: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? కార్డు లిమిట్‌ పెంచుకుంటే లాభమా... నష్టమా..?
Credit Card Limit
Follow us on

Credit Card Limit: అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేది క్రెడిట్‌ కార్డులు. కానీ అనవసరంగా ఖర్చు చేస్తూ సమయానికి చెల్లించని సమయంలో మాత్రం పెనాల్టీ ఛార్జీల మోత మోగుతుంటుంది. కార్డు వాడుకునే విధానం అన్ని తెలిసి ఉంటే మంచిది. లేకపోతే అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. అయితే క్రెడిట్‌ కార్డులను సరిగ్గా వాడుకుంటే ఎన్నో లాభాలున్నాయి. ప్రతీ క్రెడిట్‌ లిమిట్‌ను ఫిక్స్‌ చేస్తుంటాయి బ్యాంకులు. ఈ క్రెడిట్‌ లిమిట్‌ కస్టమర్‌ క్రెడిట్‌ హిస్టరీ, సిబిల్‌ స్కోర్‌పైన ఆధార పడి ఉంటుంది.  కొందరికి రూ.50 వేల వరకు క్రెడిట్‌ లిమిట్‌ ఉండవచ్చు. ఇంకొందరికి రూ.5 లక్షల వరకు లిమిట్ ఉండే ఉండవచ్చు. ఇది వారి ఆదాయం, గతంలో తీసుకున్న లోన్స్‌ చెల్లించిన తీరు, సిబిల్‌ స్కోరుపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్‌ లిమిట్‌ మొదట ఎవరికైనా తక్కువగానే ఉంటుంది. మనం వాడుకునే తీరు, సమయానికి చెల్లించే బిల్లు బట్టి లిమిట్‌ పెరుగుతుంది. క్రెడిట్‌ లిమిట్‌ ఎక్కువగా ఉంటే అప్పులపాలవుతామన్న ఆందోళన కస్టమర్లలో ఉంటుంది. లిమిట్‌ ఎక్కువగా ఉన్నా మొత్తం వాడి బిల్లు చెల్లించకపోతే అప్పులపాలవుతారు. అందుకే క్రెడిట్ కార్డును ఉపయోగించే విషయంలో కంట్రోల్ ఉండాలి. లిమిట్ ఉంది కదా అని వాడేస్తే ఇబ్బందులపాలవ్వాల్సి వస్తుంది.

అయితే క్రెడిట్‌ హిస్టరీ బాగా ఉన్న క్టమర్లకు క్రెడిట్‌ లిమిట్‌ పెంచేందుకు బ్యాంకులు ఇష్టపడుతుంటాయి. ఎస్‌ఎంఎస్‌, ఇమెయిల్‌, ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తాయి. మరి బ్యాంకులు క్రెడిట్‌ లిమిట్‌ పెంచుతామని ఆఫర్‌ ఇస్తే మీరు అంగీకరించాలా వద్దా అన్నది ఆలోచించాలి. మరి క్రెడిట్‌ లిమిట్‌ పెంచుకుంటే లాభాలు, నష్టాలు ఏమిటో చూద్దాం. అయితే క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుకోవడం వల్ల ఉపయోగాలున్నాయి. బ్యాంకులు మీకు క్రెడిట్‌ లిమిట్‌ పెంచుతామని ఆఫర్‌ ఇచ్చాయంటే మీ క్రెడిట్‌ హిస్టరీ బాగున్నట్లే. మీరు క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుకుంటే మీ క్రెడిట్‌ స్కోర్‌ కూడా పెరుగుతుంది. మీ క్రెడిట్‌ స్కోర్‌ను క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేడియో కూడా ప్రభావితం చేస్తుంది.

క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో 30 శాతం లోపే ఉండాలంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో ఉంటే మీకు ఉన్న లిమిట్‌లో ఎంత శాతం వాడారని లెక్కిస్తారు. అంటే మీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ రూ.1,00,000 అంటే మీరు రూ.30,000లోపు వాడితే మీ క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో బాగున్నట్లు. అంతకన్నా ఎక్కువ వాడితే మీ క్రెడిట్‌ స్కోర్‌ పై ప్రభావం చూపిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరిగితే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా పెంచుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదు.

క్రెడిట్‌ కార్డుపై లోన్‌

కాగా, మీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ ఎక్కువగా ఉంటే మీరు అంతే మొత్తం క్రెడిట్‌ కార్డుపై రుణం తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉండటం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంది కదా అని ఎక్కువగా క్రెడిట్ కార్డ్ వాడేస్తే అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది.

అధిక వడ్డీ సమస్యలు

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల విషయంలో ఆలస్యంగా చేస్తే అధిక వడ్డీ చెల్లించడం లాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉంటే మీ కార్డు పోయినా, ఎవరైనా దొంగిలించినా ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉంటే ట్రాన్సాక్షన్ లిమిట్ తక్కువగా పెట్టుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించొచ్చు. అందుకే క్రెడిట్‌ కార్డు వాడుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాడుకోవాల్సి ఉంటుంది. లిమిట్‌ పెంచారు కదా అని దుబారా ఖర్చులు చేస్తే సమయానికి చెల్లించని పక్షంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి: Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా…? రివార్డు పాయింట్లను ఎలా వాడాలి..? వాటి విలువ ఎంత..?

PM Kisan Samman Nidhi: రైతులకు డబుల్‌ బెనిఫిట్స్‌.. మార్చి 31లోగా చేరండి.. బ్యాంకు ఖాతాలో రూ.4 వేలు పొందండి

Provident Fund (PF): ఉద్యోగులు అలర్డ్‌.. మీరు ఈ పనులు చేయకపోతే పీఎఫ్‌ డబ్బులు తీసుకోలేరు

Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!