Online Shopping: తరచూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా.. ఈ తప్పులు చేశారో మీరు మటాష్..

|

Dec 20, 2022 | 5:09 PM

ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ షాపింగ్ యుగం నడుస్తోంది. ఏ వస్తువు కావాలన్నా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడితే నిర్ణీత సమయంలో మన దగ్గరకు వచ్చేస్తోంది. గతంలో దుకాణాలు, మాల్స్‌కు వెళ్లి కావల్సిన వస్తువులు వెతుక్కుని, బిల్లింగ్ కోసం కాసేపు వెయిట్‌ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అనేక వెబ్‌ సైట్‌లు..

Online Shopping: తరచూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా.. ఈ తప్పులు చేశారో మీరు మటాష్..
Online Shopping
Follow us on

ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ షాపింగ్ యుగం నడుస్తోంది. ఏ వస్తువు కావాలన్నా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడితే నిర్ణీత సమయంలో మన దగ్గరకు వచ్చేస్తోంది. గతంలో దుకాణాలు, మాల్స్‌కు వెళ్లి కావల్సిన వస్తువులు వెతుక్కుని, బిల్లింగ్ కోసం కాసేపు వెయిట్‌ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అనేక వెబ్‌ సైట్‌లు మనకు కావల్సిన అన్ని వస్తువులు ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నాయి. దీంతో ఫోన్ తీసుకుని కావల్సిన వస్తువులు ఆర్డర్ పెట్టేస్తున్నారు చాలా మంది. ఇదే సమయంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్న క్రమంలో కొంతమంది మోసాలకు గురవుతున్నారు. ఆన్‌లైన్ లావాదేవీలు జరిపే విషయంల కూడా కొన్ని సార్లు మోసపోతున్న ఘటనలు చూస్తున్నాం. కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటించడం ద్వారా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆన్‌లైన్ లావాదేవీలు సురక్షితంగా చేయవచ్చు. ఎక్కువ మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌పై ఆధారపడుతుండటంతో మోసగాళ్లు కూడా ఆన్‌లైన్‌ సైట్‌ల ద్వారా మోసం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడం, అనేక ఇతర పద్ధతులను ఉపయోగించి వినియోగదారుల ఖాతాలను హ్యాక్‌ చేస్తున్నారు. అయితే మోసాలకు భయపడి ఆన్‌ లైన్‌ షాపింగ్‌ను ఆపేస్తే.. మనకు ఎంతో సమయం వృధా అవుతుంది. అందుకే కింది జాగ్రత్తలను పాటించడం ద్వారా ఆన్‌ లైన్‌ లావాదేవీల్లో మోసాలకు అడ్డుకట్టవేసే అవకాశం ఉంటుంది.

బయోమెట్రిక్ లాగిన్‌కు ప్రాధాన్యత..

పాస్‌వర్డ్‌లను ఉపయోగించకుండా బయోమెట్రిక్ లాగిన్‌ ఆధారంగా షాపింగ్ చేయడం మంచిదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేయడం సులభం. పాస్‌వర్డ్‌లను తరచూ మార్చుకునే పనికి బదులు బయోమెట్రిక్‌లు, ఈసిగ్నేచర్‌ల ప్రయోజనాలను పొందవచ్చు. బ్యాంకులు కస్టమర్లకు రియల్ టైమ్ ప్రొటెక్షన్ అందించడంతోపాటు పాస్‌వర్డ్ ప్రామాణీకరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సైబర్ సెక్కూరిటీ నిపుణులు తెలియజేస్తున్నారు.

వెరిఫికేషన్‌లో బహుళ రకాలు

ఆన్‌లైన్ లావాదేవీల కోసం బ్యాంకులు వినియోగదారులకు బహుళకారకాల ప్రమాణీకరణ ఎంపికను ఎక్కువగా ఇస్తున్నాయి. వినియోగదారులు కూడా అలాంటి పద్ధతులను ఎంచుకోవాలి. ఎందుకంటే, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ విషయంలో, మోసగాళ్లు ఒక్క పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేసినా ఖాతాలో నగదును దొంగిలించలేరు. మీకు మరొక స్థాయి ప్రమాణీకరణ ఎంపిక ఉంది. ప్రస్తుతం అనేక బ్యాంకులు కస్టమర్లకు బహుళకారకాల ప్రమాణీకరణ ఎంపికలను అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

రిమోట్ యాక్సెస్‌ను యాక్సెప్ట్ చేయ్యొద్దు

ఎవరికైనా రిమోట్ యాక్సెస్ ఇచ్చినట్లయితే, వారు మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్ యొక్క అన్ని కదలికలను గమనించగలరు. మీకు తెలియకుండానే, మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ అన్నీ వేరే వాళ్లకు ఈజీగా తెలిసే అవకాశం ఉంది. మోసగాళ్లు మీ ఫోన్‌ని బ్లాక్ చేసి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీన్ని నివారించడానికి తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు. ఇతరులకు రిమోట్ యాక్సెస్ ఇవ్వవద్దు.

OTPని షేర్ చేయకూడదు

ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో వచ్చిన OTPని ఎవరితోనూ పంచుకోవద్దు. మోసగాళ్లు అనేక తప్పుడు మాటలు చెప్పి కస్టమర్‌ని నమ్మించేలా చేయడం ద్వారా OTPని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు, పిన్, OTP ఏ కారణం చేతనైనా ఎవరితోనూ పంచుకోవద్దు.

పబ్లిక్, ఉచిత వైఫైని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్త..

పబ్లిక్ ప్లేస్‌లలో, ఉచిత వైఫైకి ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్ కనెక్ట్ చేయడం మంచిది కాదు. ఇలాంటి వైఫైలు రహస్య సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ లావాదేవీల కోసం మీ ఫోన్‌లో లేదా ఇంట్లోని డేటా కనెక్షన్ యొక్క డేటాను ఉపయోగించడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..