LIC Premium: మీరు ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించాలా? ఆఫీస్‌కు వెళ్లకుండానే ఇలా ఇంట్లో కూర్చుని చెల్లించండి

|

Jan 23, 2023 | 6:31 PM

నేటి కాలంలో టెక్నాలజీ మరింతగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఏదైనా లావాదేవీల విషయంలో బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ కాలం మరిపోయింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో బ్యాంకుకు వెళ్లకుండానే

LIC Premium: మీరు ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించాలా? ఆఫీస్‌కు వెళ్లకుండానే ఇలా ఇంట్లో కూర్చుని చెల్లించండి
Lic Premium
Follow us on

నేటి కాలంలో టెక్నాలజీ మరింతగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఏదైనా లావాదేవీల విషయంలో బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ కాలం మరిపోయింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో బ్యాంకుకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చుని పనులు చేసుకునే సదుపాయం వచ్చింది. మార్కెట్లో పెట్టుబడి కోసం అనేక ఆప్షన్స్‌ ఉన్నాయి. కానీ నేటికీ చాలా మంది ప్రజలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. పాలసీని కొనుగోలు చేసిన తర్వాత, ప్రజలు వారి అవసరాలకు అనుగుణంగా దాని ప్రీమియం చెల్లిస్తారు. మీరు ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించేందుకు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రీమియం యూపీఐ ద్వారా కూడా చెల్లింపులు చేసుకోవచ్చు. నిమిషాల వ్యవధిలోనే ఈ పని పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఎల్‌ఐసి కార్యాలయం లేదా బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేదు.

యూపీఐ ద్వారా ప్రీమియం డిపాజిట్ చేయండి:

ఇప్పుడు మీరు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా ఎల్‌ఐసీ ప్రీమియంను కొన్ని నిమిషాల్లో జమ చేయవచ్చు. భారతదేశంలో యూపీఐ వినియోగం గత కొన్ని సంవత్సరాలుగా చాలా వేగంగా పెరిగింది. ఈ రోజుల్లో నగదును ఉంచడానికి బదులుగా, ప్రజలు సులభంగా Paytm, Phone Pay, Google Pay మొదలైన యాప్స్‌ ద్వారా ఒక బ్యాంకు ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మీ యూపీఐ యాప్ ద్వారా ఎల్‌సీ ప్రీమియం కూడా చెల్లించవచ్చు. మరి ఈ యాప్స్‌ను ఉపయోగించి ప్రీమియం ఎలా చెల్లించాలో తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

ఫోన్ పే ద్వారా ఎల్‌ఐసీ ప్రీమియం డిపాజిట్:

  • ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించడానికి ముందుగా Phone Pe యాప్‌ని ఓపెన్‌ చేయండి.
  • దీని తర్వాత మీరు బీమా ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • తర్వాత ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • తర్వాత మీ ఎల్‌ఐసీ నంబర్, ఇమెయిల్ ఐడిని నమోదు చేయండి. తర్వాత కన్ఫర్మ్‌పై క్లిక్ చేయండి.
  • దీని తర్వాత మీరు ఎంచుకున్న చెల్లింపు ఎంపికను చూస్తారు.
  • దీని తర్వాత మీ క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలను నమోదు చేయండి.
  • ఈ ఓటీపీ వచ్చిన తర్వాత, దాన్ని నమోదు చేయండి.
  • దీని తర్వాత మీ ఎల్‌ఐసీ ప్రీమియం డిపాజిట్ చేయండి.

పేటీఎం ద్వారా..

  • ఎల్‌ఐసీ ప్రీమియం డిపాజిట్ చేయడానికి, ముందుగా Paytm యాప్‌ని తెరవండి.
  • దీని తర్వాత మీరు ఎల్‌ఐసీ ఇండియా ఎంపికను చూస్తారు, దానిపై క్లిక్ చేయండి.
  • తర్వాత ఎల్‌ఐసీ పాలసీ నంబర్‌ను నమోదు చేయండి. తర్వాత వివరాలు నమోదు చేయండి.
  • దీని తర్వాత మీరు చెల్లింపు కోసం ప్రొసీడ్ ఎంపికను ఎంచుకోవాలి.
  • దీని తర్వాత, చెల్లింపు ఎంపికను ఎంచుకుని, పిన్‌ను నమోదు చేయడం ద్వారా లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ ద్వారా చెల్లింపు చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి