Deposit Scheme: FD పర్సనల్ ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలల్లో రెపో రేటును రెండుసార్లు 0.90 శాతం పెంచింది. ఆ తర్వాత బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఫలితంగా వడ్డీ రేట్లు పెరిగాయి. ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమా అనేది ఇప్పుడు ఇన్వెస్టర్ల ముందున్న అతిపెద్ద ప్రశ్న. మీరు చిన్న పొదుపు పథకాలు, ఎఫ్‌డిలు, మెచ్యూరిటీ ఫండ్‌లు, ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్‌లు, డెట్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు మరికొన్ని డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి బ్యాంకులు.
ఏ స్కీమ్‌పై ఎంత వడ్డీ రేటు:
ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) : 5.5 శాతం
డెట్ ఫండ్ (DF): 5.25 శాతం నుంచి 5.45 శాతం వరకు
పీపీఎఫ్ (PPF): 7.1 శాతం
సుకన్య సమృద్ధి యోజన (SSY): 7.6 శాతం
కిసాన్ వికాస్ పత్ర (KVP) :6.9 శాతం
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): 7.4 శాతం
చిన్న పొదుపు పథకాలలో మంచి ప్రయోజనాలున్నాయి. బ్యాంకు డిపాజిట్ కంటే మెరుగైన వడ్డీ రేటు పొందవచ్చు. అలాగే సెక్షన్ 80C కింద ప్రయోజనాలు అందుకోవచ్చు. రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి