Home Loan: ఆ నిబంధనతో హోమ్ లోన్ పొందడం కష్టంగా ఉందా.?ఈ టిప్‌తో సమస్య ఫసక్..!

సొంత ఇంటి కోసం సొమ్ము కొరత కారణంగా లోన్ కోసం బ్యాంకుల వద్దకు వెళ్తే చాలా మందికి ఇటీవల కాలంలో బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఏదైనా సంస్థలో పని చేసే వ్యక్తికి అధిక గృహ రుణాన్ని అందించడంలో బ్యాంకులు ఉదారంగా వ్యవహరిస్తున్నా జీతం లేకుండా స్వయం ఉపాధి పొందేవారిక రుణాలు ఇవ్వడం లేదు. అయితే ఇలాంటి వాళ్లు చిన్న టిప్ పాటిస్తే బ్యాంకుల్లో లోన్ ప్రాసెస్ మరింత సులువు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Home Loan: ఆ నిబంధనతో హోమ్ లోన్ పొందడం కష్టంగా ఉందా.?ఈ టిప్‌తో సమస్య ఫసక్..!
Bank Home Loan
Follow us

|

Updated on: Jul 02, 2024 | 10:02 PM

సొంత ఇంటిని కొనుగోలు చేయడం అనేది ప్రస్తుత చాలా మందికి జీవితకాల కల. ఈ నేపథ్యంలో తమ పొదుపులతో పాటు లోన్ సాయంతో మంచి ఇంటిని కొనుగోలు చేయాలని ఆశపడుతూ ఉంటారు. సొంత ఇంటి కోసం సొమ్ము కొరత కారణంగా లోన్ కోసం బ్యాంకుల వద్దకు వెళ్తే చాలా మందికి ఇటీవల కాలంలో బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఏదైనా సంస్థలో పని చేసే వ్యక్తికి అధిక గృహ రుణాన్ని అందించడంలో బ్యాంకులు ఉదారంగా వ్యవహరిస్తున్నా జీతం లేకుండా స్వయం ఉపాధి పొందేవారిక రుణాలు ఇవ్వడం లేదు. అయితే ఇలాంటి వాళ్లు చిన్న టిప్ పాటిస్తే బ్యాంకుల్లో లోన్ ప్రాసెస్ మరింత సులువు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గృహ రుణం విషయంలో తీసుకోవాల్సిన టిప్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఇటీవల కొన్ని బ్యాంకులు తనఖా హామీపై రుణాలను అందిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తగినంత క్రెడిట్ హిస్టరీ లేదా తక్కువ క్రెడిట్ స్కోర్‌ రుణగ్రహీతలకు ఈ తరహా గృహ రుణాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేరియబుల్ ఆదాయ నమూనాలు లేదా క్రెడిట్ రికార్డులు లేకపోవడం వల్ల సాంప్రదాయ రుణ అర్హత ప్రమాణాలను అందుకోలేని గృహ కొనుగోలుదారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బ్యాంకు సాధారణంగా అందించే దానికంటే రుణం-విలువ నిష్పత్తి ఎక్కువగా ఉంటే గ్యారెంటీ అంతరాన్ని తగ్గించే అవకాశం ఉంది. 

ఐఎంజీసీ కవరేజీ 

ఈ కవరేజీ గృహ రుణాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన నియంత్రణ నిబంధనలతో పని చేస్తుంది. కాబట్టి అదనపు రుణం తర్వాత కూడా ఎల్‌టీవీ నిష్పత్తి నియంత్రణ మార్గదర్శకాల పరిధిలోనే ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ. 50 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. మీరు పొందే గరిష్ట రుణ మొత్తం ఈ విలువలో 80 శాతం ఉంటుంది. అంటే సుమారు ఇది రూ. 40 లక్షలుగా ఉంటే బ్యాంకు కేవలం రూ. 35 లక్షలు మాత్రమే గృహ రుణంగా మంజూరు చేస్తుంది. ఒకవేళ మీకు ఐఎంజీసీ కవరేజీ ఉంటే రూ. 5 లక్షలు ఎక్కువగా పొందవచ్చు. 2018లో ఐఎంజీసీ సహకారంతో తనఖా హామీ పథకాన్ని ప్రారంభించిన మొదటి బ్యాంక్ ఎస్‌బీఐ. లోన్ సమస్యల కారణంగా తమ మొదటి ఇంటిని సొంతం చేసుకోవడం కష్టంగా ఉన్న స్వయం ఉపాధి, జీతం లేని కస్టమర్‌లపై దృష్టి సారించి ఈ కవరేజీకీ ఎస్‌బీఐ ఓకే చెప్పింది.  హోమ్ లోన్ దరఖాస్తుదారులు ఐఎంజీసీ డిఫాల్ట్ గ్యారెంటీ కవర్‌ని ఎంచుకోవడం ద్వారా వారి రిస్క్ గ్రేడ్ ఆధారంగా అధిక ఫైనాన్స్ పొందవచ్చు. ముఖ్యంగా రూ. 30 లక్షల హోమ్ లోన్‌పై ఐఎంజీసీ గ్యారెంటీ కోసం ఒక పర్యాయ రుసుము కింద కేవలం రూ. 300 నుండి రూ. 360 వరకు వన్‌టైమ్ రుసుము కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే వన్-టైమ్ రుసుముతో పాటు రుణగ్రహీత ఈ పథకం కింద అధిక వడ్డీ రేటును కూడా చెల్లించాల్సి ఉంటుందని గమనించాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో
సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
కాషాయ కండువా కప్పుకోవాలంటే ఈ పరీక్ష నెగ్గాల్సిందేనట..!
కాషాయ కండువా కప్పుకోవాలంటే ఈ పరీక్ష నెగ్గాల్సిందేనట..!
అంజీర్ ఏ సమయంలో తింటే బెటర్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
అంజీర్ ఏ సమయంలో తింటే బెటర్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
మంచాన పడ్డ టెక్నీషియన్.. లక్షల్లో సాయం చేసిన స్టార్ హీరో
మంచాన పడ్డ టెక్నీషియన్.. లక్షల్లో సాయం చేసిన స్టార్ హీరో
ఈ లక్షణాలు కనిపిస్తుంటే శరీరంలో షుగర్‌ పెరుగుతుందని అర్థం!
ఈ లక్షణాలు కనిపిస్తుంటే శరీరంలో షుగర్‌ పెరుగుతుందని అర్థం!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
ఏసీ భోగి వద్ద అనుమానాస్పదంగా 4 బ్యాగులు.. ఓపెన్ చేయగా
ఏసీ భోగి వద్ద అనుమానాస్పదంగా 4 బ్యాగులు.. ఓపెన్ చేయగా
గూగుల్‌ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మకండి.. ఇవి గుర్తు పెట్టుకోండి..
గూగుల్‌ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మకండి.. ఇవి గుర్తు పెట్టుకోండి..
'పని భారం తాళలేక.. ఆత్మహత్య చేసుకున్న రోబో!' నెటిజన్ల సంతాపం
'పని భారం తాళలేక.. ఆత్మహత్య చేసుకున్న రోబో!' నెటిజన్ల సంతాపం