01 July 2024
TV9 Telugu
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తమ మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ప్లాన్లను భారీగా పెంచేసింది.
తక్కువలో తక్కువంగా 12.5 శాతం నుంచి.. 25 శాతానికి రేట్లు పెంచేస్తూ కీలక ప్రకటన జారీ చేసింది రిలయన్స్ జియో.
రిలయన్స్ జియో వినియోగదారులకు వడ్డించిన ఈ రీఛార్జ్ ధరలు జూలై 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
జూలై 3 నుంచి మాత్రం.. 155 రూపాయల ప్లాన్.. 189 రూపాయలు అవుతుంది. అలాగే.. 209 రూపాయల ప్లాన్ 249 రూపాయలు.
239 రూపాయల ప్లాన్ కు 299 రూపాయలు.. అలాగే 299 రూపాయల ప్లాన్ కు 349 రూపాయలుకు చేరుకుంది.
ఇక 349 రూపాయల ప్లాన్ ధర 399 రూపాయలకు చేరుకుంది. అలాగే రూ.399 ప్లాన్ ధర 449 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది.
రోజుకి 2.5 జీబీ డేటా అందించే 365 రోజుల వ్యాలిడిటీ ఉండే యాన్యువల్ ప్లాన్ రేటును రూ.2,999 నుంచి రూ.3,599 కి పెంచింది
రోజుకి 2జీ డేటా లేదా అంతకంటే ఎక్కువ డేటా అందించే అన్ని ప్లాన్లు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి.