ఇదంతా అబద్దం.. ఇలాంటివి నమ్మితే ఎలా..?  క్లారిటీఇచ్చిన రైల్వే శాఖ

02 July 2024

TV9 Telugu

రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా రైల్వే కౌంటర్లనో, లేక ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసుకుంటామన్న విషయం అందరికి తెలిసిందే.

ఐఆర్‌సీటీసీ 

 రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ యాప్‌పై చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటారు.

టికెట్లు బుక్

ఇండియన్ రైల్వేస్‌ వారి ఈ అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రతి నిత్యం వేలాది మంది సేవలు పొందుతున్నారు

ఇండియన్ రైల్వేస్‌

టికెట్స్‌ తమకు తాము బుక్ చేసుకోవడంతో పాటు ఇతరులకు కూడా బుకింగ్ చేస్తుంటారు. అయితే ఇటీవల నుంచి కొన్ని ఫేక్‌ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఫేక్‌ వార్తలు

అయితే ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌పై ఒకరి ఐడీని ఉపయోగించి ఇతరులకు టికెట్లు బుక్ చేయడం నేరమని, ఇందుకు జైలుశిక్ష పడుతుందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది

ఐఆర్‌సీటీసీ

ఈ ప్రచారాన్ని నమ్మి వేలాది మంది ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం రైల్వే దృష్టికి కూడా వెళ్లింది. 

రైల్వే దృష్టికి

ఐఆర్‌సీటీసీపై ఒకరి ఐడీ నుంచి ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలుశిక్ష పడుతుందనేది అవాస్తవమని, ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.

ఒకరి ఐడీ నుంచి

యూజర్లు తమ ఐడీని ఉపయోగించి వేర్వేరు ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులకు టిక్కెట్‌లు బుక్ చేయవచ్చునని క్లారిటీ ఇచ్చింది. ఈ-బుకింగ్‌కు సంబంధించిన పలు నిబంధనలను వెల్లడించింది.

రిలయన్స్ జియో