
కొత్త సంవత్సరం, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న ప్రజలంతా పల్లెబాట పట్టనున్నారు. పండగ సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలకు కటుంబ సభ్యులతో కలిసి టూర్‌కు వెళ్లే ప్లాన్స్ చేస్తారు. ఇది వింటర్ సీజన్ కావడంతో చాలా మంది అరుకు ట్రిప్‌కు వెళ్లాలనే ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికి ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. అరకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కొత్త రైలును అనౌన్స్ చేసింది.
అరకు ప్రత్యేక ట్రైన్ వివరాలు
అరకు వెళ్లే టూరిస్టుల కోసం విశాఖపట్నం-అరకు మధ్య 08525 నెంబర్ గల ప్రత్యేక రైలును నడపనుంది. రైల్వేశాఖ. ఈ ట్రైన్ మంగళవారం ( 30.12.2025) నుంచి 18.01.2026 వరకూ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ ట్రైన్ ప్రతీ రోజూ ఉదయం 8:40కి విశాఖపట్నం నుంచి బయల్దేరి సింహాచలం, కొత్తవలస,శృంగవరపుకోట, బొర్రా గుహలు మీదుగా మధ్యాహ్నం 12:30కి అరకు చేరుకుంటుంది.
ఈస్ట్‌కోస్ట్ రైల్వే నడుపుతున్న మరో ట్రైన్ అరకు- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తుంది. 08526 నెంబర్ గల ఈ ట్రైన్ కూడా మంగళవారం 30.12.2025 నుంచి వచ్చే ఏడాది 18.01.2026 వరకూ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ ప్రత్యేక రైలు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు అరకు నుంచి బయల్దేరి సాయంత్రం 6:00 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా సింహాచలం, కొత్తవలస,శృంగవరపుకోట, బొర్రా గుహలు మీదుగానే రాకపోకలు సాగిస్తుంది.
ట్రైన్స్ ప్రత్యేకతలు
ఈ రెండు ప్రత్యేక రైళ్లలో 2AC-1,3AC 1, స్లీపర్ క్లాస్ 10, జనరల్-03, జనరల్ కమ్ లగేజ్-01 బోగీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. అరకు టూర్‌కు వచ్చే ప్రయాణికులు ఈ ప్ర్యతేక రైళ్ల సౌకర్యాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి