HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా?.. క్షణాల్లోనే లోన్‌ మంజూరు.. చెక్‌ చేసుకోండిలా!

HDFC Bank: దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు తీపికబురు అందించింది. సులభంగానే రుణాలు అందిస్తోంది..

HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా?.. క్షణాల్లోనే లోన్‌ మంజూరు.. చెక్‌ చేసుకోండిలా!

Updated on: Sep 03, 2021 | 1:46 PM

HDFC Bank: దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు తీపికబురు అందించింది. సులభంగానే రుణాలు అందిస్తోంది. ఇన్‌స్టంట్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. కస్టమర్లు వారి ఆర్థిక అవసరాలకు తక్షణ స్వల్ప కాలిక రుణాలు పొందవచ్చని బ్యాంకు వెల్లడించింది. అయితే ఈ సదుపాయం కేవలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్యాంకు తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై సులభంగానే తక్షణం రుణం పొందొచ్చని బ్యాంకు వివరించింది. క్షణాల్లో డబ్బులు బ్యాంకు ఖాతాలో జమవుతాయి.

లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు..

కాగా, మీరు కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటే.. లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీరు హెచ్‌డీఎఫ్‌సీ లోన్ లింక్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌, క్రెడిట్‌ కార్డుపై ఉండే చివరి నాలుగు అంకెలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు రుణానికి అర్హులా..? కదా.. అనే విషయం తేలిపోతుంది.

మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే.. వెంటనే రుణ మొత్తం ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రుణ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. తీసుకున్న రుణాన్ని 12 నెలల నుంచి 60 నెలలలోగా తిరిగి చెల్లించాలి. అంతేకాకుండా వినియోగదారులకు ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రిఫండ్ బెనిఫిట్ లభిస్తోంది.

 

ఇవీ కూడా చదవండి:

Trai: టెలికాం కంపెనీలపై ట్రాయ్‌ కన్నెర్ర.. కీలక ఆదేశాలు జారీ.. హద్దులు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరిక..!

Doorstep Banking: ఎస్‌బీఐ డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌.. ఇంటి వద్దనే రూ.20 వేల వరకు పొందవచ్చు

Google Pay FD: బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు.. ఎలాగంటే..!

Loading...
Unable to load recommendations.
Follow Us