Gogoro EV Scooter: మరో కొత్త ఈవీ లాంచ్‌ చేసిన గోగోరో.. క్రాస్‌-ఓవర్‌ టెక్నాలజీతో వచ్చే ఈవీ ప్రత్యేకతలివే..!

| Edited By: Ravi Kiran

Oct 27, 2023 | 9:20 PM

ఈ-మొబిలిటీ రంగంలో ప్రసిద్ధి చెందిన ఈ తైవాన్ బ్రాండ్ ఇప్పుడు క్రాస్‌ఓవర్‌ పేరుతో ఓ కొత్త స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ గోగోరోకు సంబంధించిన మొదటి టూ-వీల్ ఎస్‌యూవీ అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ స్కూటర్‌లో ఆల్-టెర్రైన్ ఛాసిస్‌తో పాటు 14.2 సెంటీ మీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్కూటర్‌ పట్టణ ప్రాంతాల్లో రోడ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని కఠినమైన రోడ్లను తట్టుకునేలా రూపొందించారు.

Gogoro EV Scooter: మరో కొత్త ఈవీ లాంచ్‌ చేసిన గోగోరో.. క్రాస్‌-ఓవర్‌ టెక్నాలజీతో వచ్చే ఈవీ ప్రత్యేకతలివే..!
Gogoro Crossover
Follow us on

ప్రపంచ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా ఉన్న గొగోరో ఓ కొత్త మోడల్‌ ఈవీను లాంచ్‌ చేసింది. ఈ-మొబిలిటీ రంగంలో ప్రసిద్ధి చెందిన ఈ తైవాన్ బ్రాండ్ ఇప్పుడు క్రాస్‌ఓవర్‌ పేరుతో ఓ కొత్త స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ గోగోరోకు సంబంధించిన మొదటి టూ-వీల్ ఎస్‌యూవీ అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ స్కూటర్‌లో ఆల్-టెర్రైన్ ఛాసిస్‌తో పాటు 14.2 సెంటీ మీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్కూటర్‌ పట్టణ ప్రాంతాల్లో రోడ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని కఠినమైన రోడ్లను తట్టుకునేలా రూపొందించారు. గొగోరో క్రాస్‌ఓవర్ యుటిలిటీ, అడ్వెంచర్ అనే రెండు వెర్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ స్కూటర్‌లో నాలుగు లగేజీ కంపార్ట్‌మెంట్స్‌తో రావడం వల్ల ప్రజలను విపరీతంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. గోగోరో క్రాస్‌ ఓవర్‌ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

క్రాస్‌ఓవర్ కేవలం విభిన్న భూభాగాలను పరిష్కరించడం మాత్రమే కాకుండా రైడర్‌లకు అధునాతన రైడింగ్‌ ఫీల్‌ కలుగజేసాలా దీన్ని రూపొందించారు. ముఖ్యంగా ఈ స్కూటర్‌లో వచ్చే నాలుగు అంతర్నిర్మిత కార్గో కంపార్ట్‌మెంట్‌ల వల్ల ఫ్యామీలి రైడ్‌కు సరిగ్గా సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స్కూటర్‌ 7.6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారుతో పాటు గొగోరోకు సంబంధించిన సిగ్నేచర్ ఫ్లో డ్రైవ్ బెల్ట్ సిస్టమ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్కూటర్‌ పవర్‌, సైలెంట్ ఆపరేషన్‌లకు హామీ ఇస్తుంది. ఈ స్కూటర్‌లో కొత్తగా రూపొందించిన ఆల్-టెర్రైన్ చట్రం స్కూటర్‌ దృఢత్వాన్ని పెంచుతుంది. ఈ స్కూటర్‌ అయితే 14.2 సెంటీ మీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కఠినమైన రోడ్డుల్లో సజావుగా ప్రయాణం చేయడానికి వీలు కల్పిస్తాయి. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో పాటు ఐచ్ఛిక క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో భద్రతపరంగా ఈ స్కూటర్‌ ముందంజలో ఉంది. 

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా గోగోరో టెక్నాలజీ యాప్‌ ద్వారా ఈ స్కూటర్‌ను కనెక్ట్‌ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే ఎల్‌టీఈ స్మార్ట్ రిమోట్ ద్వారా ఈ స్కూటర్‌పై రైడ్‌ చేయవచ్చు. తైవాన్‌లో క్రాస్‌ఓవర్, క్రాస్‌ఓవర్ ఎస్ అనే రెండు వేరియంట్‌లలో ప్రారంభించారు. గొగోరో దాని లభ్యతను ఇతర దేశాల్లో ఈ స్కూటర్‌ను విస్తరించాలని సూచించింది. కాబట్టి భారతదేశంలో ఈ స్కూటర్‌ను లాంచ్‌ చేసే వరకూ వేచి చూడాల్సిందే.