Annadata Sukhibhava: రైతులకు గుడ్‌న్యూస్‌.. దీపావళి కానుకగా అకౌంట్లో రూ.7 వేలు!

Annadata Sukhibhava: రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ యోజన స్కీమ్‌ 21వ విడత డబ్బులను విడుదల చేయాలని భావిస్తోంది. దీంతో పాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయం మొత్తం 7 వేల రూపాయలు జమ చేస్తామని..

Annadata Sukhibhava: రైతులకు గుడ్‌న్యూస్‌.. దీపావళి కానుకగా అకౌంట్లో రూ.7 వేలు!

Edited By: TV9 Telugu

Updated on: Oct 10, 2025 | 5:58 PM

Annadata Sukhibhava: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్‌ ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు 5 వేల రూపాయలు ఈనెలలోనే జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ యోజన స్కీమ్‌ 21వ విడత డబ్బులను విడుదల చేయాలని భావిస్తోంది. దీంతో పాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయం మొత్తం 7 వేల రూపాయలు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఇది కూడా చదవండి: Ratan Tata Death Anniversary: ఆ సాయంత్రం వర్షమే రతన్‌ టాటా కల సాకారం చేసింది.. అదేంటో తెలుసా?

పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులు రూ.2000, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5000 కలిపి మొత్తం విడుదల చేయనున్నారు. సుమారు 47 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో ఏడు వేల రూపాయలు చొప్పున జమ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, ఈ క్రమంలోనే దీపావళి పండగ సమయంలో పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా అప్పుడే రైతుల అకౌంట్లలో పడే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: New Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ.. ధర ఎంతో తెలుసా?

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దీపావళికి భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి