Anand Mahindra: కారుకు మంచి పేరు పెట్టండి.. నెటిజన్లకు ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్..

|

Oct 08, 2022 | 8:48 AM

మహీంద్రా సంస్థ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ)లో స్కార్పియో-ఎన్‌ మూడో తరం వాహనం. ఈ సంస్థ గత ఇరవై ఏళ్లలో రెండు మోడల్స్‌ను మార్కెట్‌లోకి..

Anand Mahindra: కారుకు మంచి పేరు పెట్టండి.. నెటిజన్లకు ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్..
Anand MahindraRreceived Scorpio N Vehicle
Follow us on

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తనకు నచ్చిన అంశాలను పోస్టు చేయడంతో పాటు.. అప్పుడప్పుడు వివిధ అంశాల్లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ఆనంద్ మహీంద్రా.. ఇటీవల మైండ్ టెస్ట్ కు సంబంధించి చేసిన పోస్టు ఎంతో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు తనదైన స్టైల్ లో చేసిన మరో ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఆయన చేతికొచ్చిన ఓ కారుకు పేరు పెట్టాలని నెటిజన్లను అడిగాడు. అదేంటి కారుకు కంపెనీ పేరు ఉంటుంది కదా.. మళ్లీ పేరు పెట్టడం ఏమిటనుకుంటున్నారా.. అయితే రీడ్ దిస్ స్టోరీ. మహీంద్రా సంస్థ రెండు నెలల క్రితం ఎస్‌యూవీ స్కార్పియో ఎన్‌ మోడల్‌ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రెండు వారాల క్రితమే వీటి డెలివరీలు కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా సంస్థ ప్రతినిధి ఆనంద్‌ మహీంద్రాకు కారు తాళాలు అందించారు వారి కంపెనీ ప్రతినిధులు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈరోజు తనకు చాలా అద్భుతమైన రోజు అని స్కార్పియో ఎన్‌ కారు తన చేతికొచ్చిందని చెబుతూనే దీనికి ఒక మంచి పేరు కావాలని, ఎవరైనా సూచిస్తే స్వాగతిస్తానంటూ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.

మహీంద్రా సంస్థ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ)లో స్కార్పియో-ఎన్‌ మూడో తరం వాహనం. ఈ సంస్థ గత ఇరవై ఏళ్లలో రెండు మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ వాహనాలకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. స్కార్పియో-ఎన్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.11.99 లక్షలు కాగా, 5 వేరియంట్స్‌లో 7 రంగుల్లో ఈకారు లభ్యమవుతోంది. జడ్ టు, జడ్4, జడ్6, జడ్8, జడ్8ఎల్ వేరియంట్లలో, ఎవరెస్ట్ వైట్, డాజిలింగ్ సిల్వర్, రాయల్ గోల్డ్, రెడ్ రేజ్, గ్రాండ్ కాన్యన్, డీప్ ఫారెస్ట్, నాపోలి బ్లాక్ రంగుల్లో ఈ కారు లభ్యమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ కారుకు సంబంధించిన బుకింగ్ లు జులై 31న ప్రారంభం కాగా.. తొలి నిమిషంలోనే 25వేల మంది బుక్‌ చేసుకున్నట్లు సంస్థ గతంలో తెలిపిన విషయం తెలిసిందే. అత్యంత వేగంగా తొలి లక్ష కార్ల బుకింగ్స్‌ పూర్తి చేసుకొని స్కార్పియో ఎన్‌ రికార్డు సృష్టించింది. తొలి 25 వేల మంది వినియోగదారులు కారును పొందేందుకు ప్రస్తుతం 4 నెలల సమయం పడుతోందని సంస్థ తెలిపింది. మహీంద్రా కంపెనీకి సంబంధించిన స్కార్పియో వాహనాలకు ఎంతో డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికి చాలామంది ఈ రకం వాహనాలను వాడటానికి ఇష్టపడుతుండటంతో వాహనదారుల అభిరుచుల మేరకు వివిధ వేరియంట్లలో కొత్త రకాల సదుపాయాలతో ఈ సంస్థ స్కార్పియో ఎన్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తలకోసం చూడండి..