Fact Check: రూ.4,500 వెరిఫికేషన్ ఫీజు తీసుకుని కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల ‘పీఎం ముద్ర యోజన’ లోన్ ఇస్తోందా? ఇదిగో క్లారిటీ

|

Nov 26, 2022 | 8:31 PM

దేశంలో ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఆ పథకాల్లో 'ప్రధానమంత్రి ముద్రా యోజన' ఒకటి. ఈ పథకం కింద యువతకు సొంతంగా వ్యాపారం..

Fact Check: రూ.4,500 వెరిఫికేషన్ ఫీజు తీసుకుని కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల పీఎం ముద్ర యోజన లోన్ ఇస్తోందా? ఇదిగో క్లారిటీ
PM Mudra Yojana Loan
Follow us on

దేశంలో ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఆ పథకాల్లో ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ ఒకటి. ఈ పథకం కింద యువతకు సొంతంగా వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం రూ.10 లక్షల వరకు రుణం ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణం తీసుకునే వ్యక్తి నుంచి వెరిఫికేషన్, ప్రాసెసింగ్ కోసం ప్రభుత్వం రూ.4,500 తీసుకుంటున్నట్లు దీని సారాంశం. ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్(పీఐబీ) ద్వారా అసలు నిజం చెప్పింది.

 

ఇవి కూడా చదవండి


సోషల్‌ మీడియాల వైరల్‌ అవుతున్న అంశంపై పీఐబీ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తపై తనిఖీ చేసింది. వైరల్‌ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ముద్రా యోజన పథకాన్ని పొందాలంటే రూ.4,500 ఫీజు చెల్లించాలనేది అవాస్తవమని తెలిపింది. ఈ ముద్ర లోన్‌ కోసం ప్రాసెసింగ్ రుసుముగా, ఇంకేదైనా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని సూచించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే లేఖ పూర్తిగా నకిలీదని పీఐబీ తన ఫ్యాక్ట్ చెక్‌లో గుర్తించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అలాంటి ఏదీ కూడా ప్రకటించలేదని తెలిపింది. పీఎం ముద్రా లోన్ తీసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి అదనపు రుసుమును వసూలు చేయడం లేదని పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి