Amul Milk Price: గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న అమూల్‌ పాల ధర.. ఎంతో తెలుసా..?

Amul Milk Price: పాల ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు అమూల్ సంస్థ ప్రకటించింది. జనవరి 26లోపు ప్రజలకు ఈ ఊరట లభించనుంది. అమూల్‌కు చెందిన మూడు వేర్వేరు పాల ఉత్పత్తులపై కంపెనీ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో అమూల్ గోల్డ్, అమూల్ టీ స్పెషల్, అమూల్ ఫ్రెష్ ఉన్నాయి. వీటి ధరలు తగ్గనున్నాయి..

Amul Milk Price: గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న అమూల్‌ పాల ధర.. ఎంతో తెలుసా..?

Updated on: Jan 24, 2025 | 4:39 PM

పాల ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు అమూల్ ప్రకటించింది. జనవరి 26లోపు ప్రజలకు ఊరట కలుగనుంది. మూడు వేర్వేరు పాల ఉత్పత్తులపై కంపెనీ ధరలను తగ్గించింది. ఇందులో అమూల్ గోల్డ్, అమూల్ టీ స్పెషల్, అమూల్ ఫ్రెష్ ఉన్నాయి. వాటి ధరలు రూ.1 తగ్గాయి. గతంలో అమూల్ గోల్డ్‌ పాల విలువ రూ.66 ఉండగా, ఇప్పుడు రూ.65కు చేరనుంది. కాగా అమూల్ టీ స్పెషల్ ధర రూ.63 నుంచి రూ.62కి చేరనుంది. అమూల్ ఫ్రెష్ ఇంతకుముందు రూ. 54కి అందుబాటులో ఉంది. ఇప్పుడు రూ.53కే లభ్యం కానుంది. ఈ తగ్గింపు ధర 1-లీటర్ ప్యాక్‌లపై మాత్రమే వర్తిస్తుంది.

ఈ విషయాన్ని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా ప్రకటించారు. గణతంత్ర దినోత్సవానికి ముందు ఈ పాల ధర తగ్గింపు నిర్ణయం తీసుకోనుంది. పాల ధర తగ్గింపు తర్వాత, దాని వెనుక కంపెనీ ఎటువంటి కారణం చెప్పలేదు. పాల ధరల పెంపు తర్వాత అమూల్ తొలిసారిగా ఈ మేరకు కోత విధించింది. ఇప్పుడు మదర్ డెయిరీ కూడా ధరలను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి