భారత్‌కు గుడ్‌న్యూస్.. ఇంధన సరఫరాపై తొలగిన అడ్డంకి.. ఇక పెట్రోల్‌ కష్టాలు లేనట్టే!

పశ్చిమాసియా ఉద్రికత్తల కారణంగా చమురు కొరతతో ఇబ్బంది పడుతున్న భారత్‌ సహా అనేక దేశాలకు ఇదో గుడ్‌ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇరాన్ యుద్ధం కారణంగా విధించిన ఆంక్షలను అమెరికా మరో 30 రోజుల పాటు పొడగించింది. రష్యా చమురును మరో 30 రోజులు కొనేందుకు భారత్‌కు గ్రీన్‌సిగ్నల్‌ లభించిది. ఉద్రిక్తతల కారణంగా చాలా దేశాల్లో ఏర్పడ్డ ఇంధన కొరతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా తెలిపింది.

భారత్‌కు గుడ్‌న్యూస్.. ఇంధన సరఫరాపై తొలగిన అడ్డంకి.. ఇక పెట్రోల్‌ కష్టాలు లేనట్టే!
Russian Seaborne Oil

Updated on: May 19, 2026 | 10:33 AM

ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, హర్మూజ్ జలసంది మూతబడడంతో సముద్రంలో నిలిచిపోయిన రష్యన్ చమురు నౌకలపై ఉన్న ఆంక్షల మినహాయింపును మరో 30 రోజులు పొడిగిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సోమవారం ప్రకటించారు. ఈ తాత్కాలిక పొడగింపుతో ప్రస్తుతం సముద్రంలో నిలిచిపోయిన రష్యన్ చమురును ఇందన కొరత ఏర్పడిన దేశాలు తాత్కాలికంగా కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుందని బెస్సెంట్ తెలిపారు.

పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన చమురు కొరతను అధిగమించడానికి అమెరికా అధికారులు ఈ మినహాయింపును పొడిగించడం ఇది రెండోసారి. గతంలో ఇచ్చిన మినహాయింపు గడువు శనివారంతో ముగియడంతో, యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కొత్త జనరల్ లైసెన్స్‌ను జారీ చేసినట్లు తెలిపారు. ఈ పొడిగింపు వల్ల రష్యా ఇంధన సంస్థలపై విధించిన ఆంక్షలను ఉల్లంఘించకుండానే.. ట్యాంకర్లలో నిలిచిపోయిన రష్యా చమురు, పెట్రోలియం ఉత్పత్తులను తాత్కాలికంగా పొందేందుకు వీలు కలుగుతుంది.

యుద్ధం కారణంగా ఇందన కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు ఈ పొడిగింపు ఉపశమనాన్ని కల్పిస్తుందని.. అవసరాన్ని బట్టి ఆయా దేశాలకు ప్రత్యేక లైసెన్సులు అందించడానికి తాము సిద్దంగా ఉన్నమని బెసెంట్ పేర్కొన్నారు. ప్రపంచ ముడి చమురు మార్కెట్లను స్థిరీకరించడానికి, దిగుమతి చేసుకునే ఇంధనంపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు చమురు సరఫరా సక్రమంగా అందేలా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us