వేదికపై అంబానీ ఫ్యామిలీ డ్యాన్స్: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ , ఆయన భార్య నీతా అంబానీ తమ రెండవ కోడలుకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అనంత్ అంబానీ -అతని కాబోయే భార్య రాధిక మర్చంట్ జూలై 12న వివాహం చేసుకోనున్నారు. తమ కుమారుడి వివాహాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు అంబానీ కుటుంబం శుక్రవారం (జూలై 5) సాయంత్రం ముంబైలో సంగీత కచేరీని నిర్వహించింది. బాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు, క్రికెటర్లు హాజరయ్యారు.
మొత్తం కుటుంబంతో డాన్స్:అంబానీ కుటుంబం తమ డ్యాన్స్‌తో వేడుకను చాలా ప్రత్యేకంగా చేసింది. షారూఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఓం శాంతి ఓం’లోని పాపులర్ సాంగ్ ‘దీవాంగి దివాంగి’కి ముఖేష్ అంబానీ తన కుటుంబం మొత్తంతో కలిసి డ్యాన్స్ చేశారు.
నీతా అంబానీ కూడా ‘దీవాంగి దీవాంగి’లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు తన భరతనాట్యం అందరిని ఆకట్టుకుంది. అలాగే హృదయపూర్వకంగా నృత్యం చేయడం ద్వారా తన పిల్లలతో బంధం ఏర్పడింది. ఈ సందర్భంగా పింక్ కలర్ లెహంగా ధరించి చాలా అందంగా కనిపించింది. ముఖేష్ అంబానీ నేవీ బ్లూ కుర్తా పైజామా, మ్యాచింగ్ జాకెట్‌లో అందంగా కనిపించారు.
అంబానీ ఫ్యామిలీ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్
అంబానీ కుటుంబీకుల నృత్య ప్రదర్శన వీడియోను ప్రముఖ ఛాయాచిత్రకారులు వైరల్ భయానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో ఆకాష్ అంబానీ, ఆనంద్ పిరమల్ మొదట వేదికపై కనిపించారు. ఆ తర్వాత ఇషా అంబానీ బాలీవుడ్ స్టైల్ ఎంట్రీ ఇచ్చింది. శ్లోకా తర్వాత నీతా అంబానీ వేదికపైకి వచ్చింది. నీతా అంబానీ తర్వాత ముఖేష్ అంబానీ సినిమా స్టైల్‌లోకి రావడంతో అందరూ చప్పట్లు కొట్టారు.
చివరగా వధూవరులు ప్రవేశించి, అంబానీ కుటుంబం మొత్తం కలిసి షారుక్ ఖాన్ ‘దీవాంగి-దీవాంగి’ పాటకు నృత్యం చేస్తారు. కుటుంబ బంధాన్ని చూసి సోషల్ మీడియా యూజర్లు ఇప్పుడు చాలా ఇష్టపడుతున్నారు.
మ్యూజిక్ ఫెస్టివల్‌కు బాలీవుడ్ స్టార్స్:
సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, దీపికా పదుకొణె, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, అలియా భట్, రణబీర్ కపూర్ వంటి పలువురు తారలు అనంత్ – రాధికల కచేరీకి హాజరయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ – భార్య నీతా అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, అతని కాబోయే భార్య రాధికా మర్చంట్ వివాహ వేడుకలు బుధవారం ముంబైలోని అంబానీ నివాసం అయిన యాంటిలియాలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం:
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ జూలై 12 న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం చేసుకోనున్నారు. అతిథులు ఆహ్వానాలను స్వీకరించడం ప్రారంభించారు. అవి అందమైన ఎరుపు, బంగారు రంగు కార్డ్. ఇందులో మూడు రోజుల వేడుక గురించి సవివరమైన సమాచారం ఇచ్చింది.