అమెరికా ఎన్నికల వేళ సోమవారం మార్కెట్ భారీగా పతనమయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పతనం ఎఫెక్ట్ భారతీయ బిలియనీర్లు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలకు గట్టి దెబ్బ కొట్టింది. మార్కెట్ల పతనంతో అంబానీ, అదానీ నెట్ వర్త్ పతనానికి కారణమయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ తరచూ ఊగిసలాడటంతో మార్కెట్ లో ప్రతికూల పరిస్థితులు తలెత్తి పెద్ద ఎత్తున పతనమయ్యాయి. సోమవారం BSE సెన్సెక్స్ 1,491.52 పాయింట్లు కోల్పోయి 78,232.60 వద్ద స్థిరపడింది. ఈ మార్కెట్ల పతనం బిలియనీర్లు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానిల నెట్ వర్త్ ను ప్రభావితం చేసింది.
ఈ ఇద్దరు బిలియనీర్లు 4,022 కోట్ల రూపాయలకు సమానమైన 4.78 బిలియన్ డాలర్లు కోల్పోయారు. ఈ దెబ్బతో అంబానీ, ఆదానీలు ఇద్దరు కూడా భారత బిలియనీర్లు $ 100 బిలియన్ క్లబ్ లిస్ట్ నుండి నిష్క్రమించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 3% తగ్గడంతో అంబానీ నికర విలువ $ 2.72 బిల్లియన్లు పడిపోయింది.
గౌతమ్ అదాని సంపద కూడా 2.06 బిలియన్ డాలర్లు తగ్గింది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 17వ స్థానానికి పడిపోయారు.
మార్కెట్ల పతనం ప్రభావంతో ముఖేష్ అంబానీ నికర విలువ ప్రస్థుతం $98.8 బిలియన్ లకు చేరుకున్నా గాని ఓవరల్ గా ఈ సంవత్సరం అంబానీ నెట్ వర్త్ $2.42 బిలియన్లకు పెరిగింది. ఇదిలా ఉండగా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ ఇప్పుడు $92.3 బిల్లియన్లుగా ఉండడంతో అతను 18వ స్థానంలో నిలిచాడు. అయినప్పటికీ, అదానీ సంపద ఈ సంవత్సరం ఇప్పటివరకు 8.05 బిలియన్ డాలర్లు పెరిగింది.
సోమవారం ఎలోన్ మస్క్ భారీనష్టాన్ని చవిచూశారు. ఎలోన్ మస్క్ నికర విలువ $4.39 బిలియన్లు తగ్గి $258 బిల్లియన్లకు చేరుకున్నా ఈ జాబితాలో మస్క్ మొదటి స్థానం మాత్రం స్థిరంగా ఉంది. రెండవ స్థానంలో $258 బిలియన్ నికర సంపదతో అమెజాన్ ఫౌండర్ అయినా జెఫ్ బెజోస్ ఉన్నారు.
మార్క్ జుకర్ బర్గ్ $199 బిలియన్ నికర సంపదతో $200 బిలియన్ క్లబ్ నుండి నిష్క్రమించి, ఈ లిస్ట్ లో మూడవ స్థానంలో కొనసాగుతున్నారు.
ఎలోన్ మస్క్-$258 B, జెఫ్ బెజోస్-$218 B, మార్క్ జుకర్ బర్గ్-$199 B, లారీ ఎలిసన్-$181 B, బెర్నార్డ్ ఆర్నాల్ట్-$176 B, బిల్ గేట్స్-$157 B, లారీ పేజ్-$152 B, సెర్గీ బ్రిన్-$144 B, స్టీవ్ బెర్నాల్-$142 B, చివరగా వారెన్ బఫెట్ -$140 B.
ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీల స్టాక్స్ నష్టాలూ మార్కెట్ ని అతలాకుతలం చేస్తుండటంతో ఈ ఎఫెక్ట్ ప్రపంచంలోని సంపన్నుల స్టాక్స్ ను ప్రభావితం చేస్తున్నాయి.. దీంతో వారు తమ అస్తులను కోల్పోడం గాని కూడగట్టుకోడం గాని జరుగుతుంది.