వివిధ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగులను తొలగింపు జరుగుతోంది. ఇకఅమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఇప్పటికే 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని అమెజాన్ జనవరిలో ప్రకటించింది. దీంతో ఇప్పటికే చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఇది సరిపోదన్నట్లు అమెజాన్ మరో 9,000 మందిని తొలగించాలని యోచిస్తోంది. దీనితో 2023 ఈ సంవత్సరం అమెజాన్ మొత్తం 27,000 మందిని తొలగించనుంది. మరికొద్ది వారాల్లో ఈ 9 వేల మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
అమెజాన్‌లో ప్రస్తుతం వార్షిక ప్రణాళిక ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ రెండవ దశలో అమెజాన్ వ్యాపారంలోని ఏ ఏరియాలో ఉద్యోగాలను తగ్గించవచ్చో నిర్ణయించింది. ఈ ఎంపిక చేసిన రంగాలలో అదనపు నియామకాలు జరిగాయి.
ఉద్యోగాల కోతలతో పాటు, అమెజాన్ తన ఇతర ఖర్చులను కూడా తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఇది యూఎస్‌ఏలోని నార్త్ వర్జీనియాలో దాని ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెజాన్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ, అదే సమయంలో కొత్త ఉద్యోగులను కూడా తీసుకుంటోంది. ఈ విధంగా , ప్రస్తుతం అమెజాన్‌లో జరుగుతున్నది కంపెనీ ఖర్చులను తగ్గించడం, వ్యాపారాన్ని బలోపేతం చేయడం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి