Amazon prime: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ సభ్యత్వం చౌకగా మారింది.. ఎంత తగ్గిందంటే..

|

Dec 24, 2023 | 7:36 AM

సాధారణ ప్రైమ్ మెంబర్‌షిప్‌తో పోలిస్తే, ప్రైమ్ లైట్ ప్లాన్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇందులో వన్-డే డెలివరీ, ప్రతి వస్తువుకు రూ. 50 తగ్గింపుతో మార్నింగ్ డెలివరీ, అపరిమిత ప్రైమ్ వీడియో డివైజ్ సపోర్ట్, 4కె రిజల్యూషన్ సపోర్ట్ ఉండదు. ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కి ఈ మార్పులు మరింత సరసమైన ధరను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది అమెజాన్‌..

Amazon prime: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ సభ్యత్వం చౌకగా మారింది.. ఎంత తగ్గిందంటే..
Amazon Prime Membership
Follow us on

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ప్లాన్ కింద భారతదేశంలో ప్రైమ్ మెంబర్‌షిప్ ధరను తగ్గించింది. Amazon వెబ్‌సైట్‌లోని ప్రైమ్ సపోర్ట్ పేజీ ప్రకారం, ఈ ప్లాన్ ప్రారంభంలో రూ. 999తో ప్రారంభించగా, ఇప్పుడు అది రూ.799కి తగ్గించింది. అంటే ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ధరలో రూ.200 తగ్గింపు జరిగింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వివిధ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఒక నెల సబ్‌స్క్రిప్షన్ రూ.299కి, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ రూ.599కి, వార్షిక ప్లాన్ రూ.1,499కి అందుబాటులో ఉంది.

ధర తగ్గింపుతో పాటు, ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్‌తో అందించే ప్రయోజనాలలో కూడా కొన్ని మార్పులు చేసింది అమెజాన్‌. ఇంతకుముందు ప్లాన్‌లో రెండు రోజుల ఉచిత డెలివరీ ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఒక రోజులోనే డెలివరీ చేస్తోంది. రెండు రోజుల డెలివరీ షెడ్యూల్డ్ ను అదే రోజు డెలివరీని అందిస్తోంది. ప్రైమ్ వీడియో HD నాణ్యతకు పరిమితం చేసింది. మరొక మార్పు ఏమిటంటే, సబ్‌స్క్రిప్షన్‌లు ఇప్పుడు రెండు పరికరానికి బదులుగా ఒక పరికరానికి మాత్రమే మద్దతు ఇస్తున్నాయి. వీటిలో ప్రతి వస్తువుకు రూ. 175 చొప్పున మార్నింగ్ డెలివరీ, నో-కాస్ట్ EMI, 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్, మరిన్ని ఉన్నాయి.

సాధారణ ప్రైమ్ మెంబర్‌షిప్‌తో పోలిస్తే, ప్రైమ్ లైట్ ప్లాన్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇందులో వన్-డే డెలివరీ, ప్రతి వస్తువుకు రూ. 50 తగ్గింపుతో మార్నింగ్ డెలివరీ, అపరిమిత ప్రైమ్ వీడియో డివైజ్ సపోర్ట్, 4కె రిజల్యూషన్ సపోర్ట్ ఉండదు. ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కి ఈ మార్పులు మరింత సరసమైన ధరను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది అమెజాన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి