Amazon great indian festival: పండుగల సీజన్‌ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ప్రతీ ఏటా ఈ కామర్స్ సంస్థలు సేల్స్ తీసుకొస్తాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్‌తో పాటు ఫ్లిప్ కార్ట్ సేల్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్స్ నిర్వహించనున్నాయి. ఈ క్రమంలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు సంబంధించిన తేదీలను, పలు ఆఫర్లను ప్రకటించింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రైమ్ యూజర్లకు ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26వ తేదీ నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్‌ను అందించనున్నారు. ముఖ్యంగా ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇక అమెజాన్ పేతో పాటు ఐసీఐసీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.
ఇదిలా ఉంటే అమెజాన్ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్35 5జీ, గ్యాలక్సీ ఎస్24 అల్ట్రా, గ్యాలక్సీ ఏ35 5జీ, గ్యాలక్సీ ఏ55 5జీతో పాటు వన్‌ప్లస్ 11ఆర్, 12 ఆర్, నార్డ్ సీఈ4 లైట్, నార్డ్ సీఈ4 ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ అందించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఐక్యూ జెడ్9 ఎస్ సిరీస్, రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ, రియల్ జీటీ 6టీ వంటి ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్స్ లభించనున్నాయి.
ఇక ఫ్లిప్‌కార్ట్ సైతం బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఈ నెల 27 నుంచే ప్రారంభించనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ సభ్యులకు ఒక రోజు ముందు నుంచే ఇది అందుబాటులోకి వస్తుంది. ఒకే రోజులో డెలివరీ చేసేందుకు 2 లక్షలకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగదారులకు 10% డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..