మార్కెట్లో కొత్త వాహనం వస్తోంది అంటే అది ఎలక్ట్రిక్ వాహనమే అయి ఉంటోంది. అంతలా పర్యావరణ హిత విద్యుత్ వాహనాలు మార్కెట్ ను ఆక్రమించేస్తున్నాయి. అయితే సంప్రదాయ ఇంధన వాహనాలతో పోల్చితే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. వినియోగదారులు కూడా తమ అవసరాలకు అనుగుణంగా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనువైన బడ్జెట్ లో, అద్భుతమైన ఫీచర్లతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆకర్షిస్తోంది. డెల్టిక్ డ్రిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ ధర, విస్తృతమైన శ్రేణి, తేలికైన ఆకర్షణీయమైన ఫీచర్ల కారణంగా, ఇది మార్కెట్లో బాగా రాణిస్తోంది. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే డెల్టిక్ డ్రిక్స్ మీకు మంచి ఆప్షన్. దీని ధర, రేంజ్, టాప్ స్పీడ్, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, మీకు కావాల్సిన మొత్తం సమాచారం ఇదిగో ఓ లుక్కేయండి..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 60.8 V, 26 Ah సామర్థ్యంతో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఇన్‌స్టాల్ చేసింది. ఈ బ్యాటరీ ఇప్పుడు 250 W బీఎల్డీసీ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ 3 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ తో 70 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని, ఇది గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుందని తయారీదారు పేర్కొంది.
డెల్టిక్ డ్రిక్స్ ఫీచర్‌ల విషయానికి వస్తే సెంట్రల్ లాకింగ్, ఫైండింగ్ మై స్కూటర్, రివర్స్ మోషన్ స్విచ్, రిమోట్ స్టార్ట్, పుష్-బటన్ స్టార్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యాంటీ-థెఫ్ట్ అలారం, యూఎస్ బీ ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్ , డిజిటల్ ఓడోమీటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. దీనికి కీలెస్ స్టార్ట్, స్టాప్ ఆప్షన్ కూడా ఉంది. ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్స్, టెయిల్‌లైట్‌లు, హెడ్‌లైట్లు ఉన్నాయి.
బ్రేకింగ్ సిస్టమ్‌కు సంబంధించి, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. ముందు, వెనుక చక్రాలలో డ్రమ్ బ్రేక్‌లను ఉంచింది. సస్పెన్షన్ పరంగా, ముందు భాగంలో హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపున హైడ్రాలిక్ స్ప్రింగ్ మోనో-షాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది.
డెల్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 55,490 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్ కోసం రూ. 71,990కి వెళుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..