
వంద రూపాయల నాణెం ఒక స్మారక నాణెం. అంటే ఆర్ ఎస్ ఎస్ వందేళ్ల ప్రస్థానానికి గుర్తుగా తయారుచేసిన నాణెం. దీనిపై భారత్ మాత చిత్రం ముద్రించి ఉంటుంది. భారతదేశ చరిత్రలో ఒక నాణెంపై భారత్ మాత చిత్రం ముద్రించడం ఇదే ఫస్ట్ టైం. ఒక వైపున భారతదేశ జాతీయ చిహ్నం, మరొక వైపున భారత్ మాత చిత్రం కనిపిస్తుంది. అయితే ఈ కాయిన్ అందరికీ అందుబాటులోకి వస్తుందా అని చాలామందిలో డౌట్ ఉంది. అసలు విషయం ఏంటంటే..
వంద రూపాయల కాయిన్ అనేది లావాదేవీల కోసం రిలీజ్ చేసిన కాయిన్ కాదు. దీన్ని అందరూ పొందలేరు. ఆన్ లైన్ లో ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వంద రూపాయల నాణెం అనేది జ్ఞాపకార్థంగా తయారుచేసిన కాయిన్. ఇది రెగ్యులర్ కరెన్సీలాగా అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీన్ని పొందాలంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వెబ్ సైట్ లో ఆర్డర్ చేసి కొనుక్కోవాల్సి ఉంటుంది.
ఇకపోతే ప్రస్తుతం భారతదేశంలో వాడుకలో ఉన్న నాణేలు చాలానే ఉన్నాయి. రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నాణేలు సాధారణంగా మార్కెట్లో కనిపిస్తాయి. ఇవన్నీ భారతీయ కరెన్సీ వ్యవస్థలో చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే కాయిన్స్. అంటే వీటిని ఏదైనా ప్రభుత్వ లేదా బ్యాంక్ లావాదేవీల్లో ఉపయోగించొచ్చు. అయితే చెల్లుబాటు లేని కాయిన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవే రూ. 75, రూ.90, రూ.125, రూ.150 నాణేలు. అంతేకాదు వెయ్యి రూపాయల నాణెం కూడా ఉంది. అయితే ఇవన్నీ స్మారక నాణేల కిందకి వస్తాయి. వీటిని సాధారణ లావాదేవీల్లో ఉపయోగించరు. రీసెంట్ గా విడుదల చేసిన వంద రూపాయల కాయిన్ కూడా ఇలాంటిదే. దీన్ని మన రోజువారీ ట్రాన్సాక్షన్స్ కు అందుబాటులో ఉండదు. మీరు ఆర్ ఎస్ ఎస్ వందేళ్ల ప్రస్థానానికి గుర్తుగా కొనుగోలు చేయాలి అనుకుంటే ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి