ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్లు, బైక్‌లకు మార్కెట్లో కొదువ లేదు. పెద్ద సంఖ్యలో వివిధ రకాల ఫీచర్లు, అత్యాధునిక సదుపాయాలతో అంతర్జాతీయ కంపెనీలు మార్కెట్లోకి తమ వేరియంట్లను విడుదల చేస్తున్నాయి. ఆసియా, యూరప్‌లలో వీటికి డిమాండ్ అధికంగా ఉంది. ఈ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు అన్ని రకా ప్రయత్నాలను ఆయా కంపెనీలు చేస్తున్నాయి.
ఇదే క్రమంలో చైనీస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఓ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్‌ఐయూ ఎంక్యూఐ(NIU MQi) డీజిల్ ఎడిషన్ పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..
ఈ ఎన్‌యూ ఎంక్యూఐ డీజిల్ ఎడిషన్ ఎలక్ట్రిక్‌స్కూటర్ లుక్ అదిరిపోతుంది. మంచి యూనిక్ కలర్ కాంబినేషన్‌లో లభించనుంది. ఆకట్టుకొనే గ్రాఫిక్స్ తో రానుంది. ఐకానిక్ ‘డీ’ లోగో సైడ్ ప్యానెళ్లు, స్కూటర్ ఫ్రంట్ ఏరియాలో ఉంఉటంది. రెడ్ కలర్ లోని ట్రిమ్డ్ హ్యాండిల్ బార్‌తో స్టైలిష్ లుక్ తో అదరగొడుతుంది.
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్ మోడల్‌కు సమానమైన పనితీరును కలిగి ఉంది. 125cc కంబషన్ ఇంజిన్‌కు సరిసమానమైన పనితీరుని అందిస్తుంది. దీనిలో 6.5 kW, 9 hp ఉత్పత్తి చేసే మొటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 100 కిమీ/గం వేగంతో ప్రయాణించగలుగుతుంది. దీనిలోని రెండు బ్యాటరీలు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కిమీల పరిధిని అందిస్తాయి.
16-amp డొమెస్టిక్ సాకెట్‌లో ప్లగ్ చేసినప్పుడు, ఈ స్కూటర్ బ్యాటరీలను నాలుగు నుంచి ఐదు గంటలలోపు ఫుల్ చార్జ్ చేయవచ్చు. స్కూటర్ మొత్తం బరువు 128 కిలోలుగా ఉంది. అన్నీ కుదిరితే 2023 రెండో త్రైమాసికంలో ఈ స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..