TVS Creon Electric Scooter: 300 కిలోమీటర్ల రేంజ్‌.. 150సీసీ బైక్ దీటుగా పనితీరు.. టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మామూలుగా లేదుగా..

|

Jul 11, 2023 | 11:49 AM

ప్రముఖ టూ వీలర్‌ కంపెనీ టీవీఎస్‌ మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని లాంచ్‌ చేసేందుకు అంతా సిద్ధం చేస్తోంది. దీని పేరు టీవీఎస్‌ క్రెయాన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌. అన్నీ కుదిరితే 2023 ఆగస్టులో దీనిని ఆవిష్కరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఈవెంట్‌ దుబాయ్‌లో ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

TVS Creon Electric Scooter: 300 కిలోమీటర్ల రేంజ్‌.. 150సీసీ బైక్ దీటుగా పనితీరు.. టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మామూలుగా లేదుగా..
Tvs Creon Electric
Follow us on

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లకు మన దేశంలో డిమాండ్‌ అధికంగా ఉంది. వినియోగదారులు పెద్ద ఎత్తున ఈ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా అర్బన్‌ ప్రాంతాల్లోని ప్రజలు వీటిని అధికంగా తీసుకుంటున్నారు. అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్‌ చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్ ల వరకూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వినియోగదారులు కూడా అత్యాధునిక ఫీచర్లు, అనువైన బడ్జెట్లో అందుబాటులో ఉన్న స్కూటర్లనే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇదే క్రమంలో ప్రముఖ టూ వీలర్‌ కంపెనీ టీవీఎస్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని లాంచ్‌ చేసేందుకు అంతా సిద్ధం చేస్తోంది. దీని పేరు టీవీఎస్‌ క్రెయాన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌. అన్నీ కుదిరితే 2023 ఆగస్టులో దీనిని ఆవిష్కరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఈవెంట్‌ దుబాయ్‌లో ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ లోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 300 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇదే గనుక నిజమైతే ఎలక్ట్రిక్ ఆటో రంగంలో సరికొత్త రికార్డు అవుతుంది. ఇప్పటి వరకూ అంత రేంజ్ ఇచ్చే వాహనాలు మనవద్ద లేవు. ఈ నేపథ్యంతో టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

స్పోర్టీ లుక్‌లో..

క్రెయాన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ స్పోర్టీ స్టైలిష్‌ లుక్‌ లో రానుంది. అందమైన ఇంటిగ్రేటెడ్‌ డిజైన్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. దీనిలో ప్రధానంగా ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. హ్యాండిల్‌ బార్‌ పై డిజిటల్‌ డిస్‌ ప్లే ఉంటుంది. మోనో సస్పెన్షన్‌ ఉంటుంది. దీనిలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే పెరీమీటర్‌ ఫ్రేమ్‌ ఉంటుంది. ఈ పెరీమీటర్‌ ఫ్రేమ్‌ బ్యాటరీ ప్యాక్‌ కోసం ఏర్పాటు చేశారు. దీనిలోని బ్యాటరీ ప్యాక్‌ ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీవీఎస్‌ ఐ‍క్యూబ్‌ ఎస్టీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కన్నా అధిక సామర్థ్యంతో ఉంటుంది. ప్రస్తుతం ఐ‍క్యూబ్‌ ఎస్టీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 5.1kwh సామర్థ్యంతో ఉంది. అయితే రానున్న టీవీఎస్‌ క్రెయాన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీ సామర్థ్యం ఏకంగా 10kwh ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాక 10నుంచి 12 కిలోవాట్ల సామర్థ్యంతో మోటార్‌ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రేంజ్‌ ఏకంగా 300 కిలోమీటర్లు ఉంటుందని కంపెనీ చెబుతోంది. 150సీసీ సంప్రదాయ ఇంజిన్‌ వాహనాలకు దీటుగా ఈ స్కూటర్ పనితీరు ఉంటుంది.

వాస్తవానికి ఈ టీవీఎస్‌ క్రెయాన్‌ కాన్సెప్ట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొన్ని ఏళ్ల క్రితమే ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు దీనిని ఈ ఏడాది ఆగస్టులో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు టీవీఎస్‌ సిద్ధమైంది. దుబాయ్ దీని ఆవిష్కరణ కార్యక్రమం జరనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్పోర్టీ లుక్‌లో వస్తున్న మొదటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా ఇది నిలిచిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..