Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునే వారికి అలెర్ట్.. త్వరపడకపోతే నష్టపోతారంతే..!

భారతదేశంలోని ప్రజలకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు నమ్మకమైన పెట్టుబడి సాధనంగా మారాయి. ముఖ్యంగా రిటైరైన సీనియర్ సిటిజన్లు ఎఫ్‌డీల్లో పెట్టుబికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎఫ్‌డీలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తూ ఉంటాయి. అయితే త్వరలోనే ఎఫ్‌డీల వడ్డీ రేట్లు భారీగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునే వారికి అలెర్ట్.. త్వరపడకపోతే నష్టపోతారంతే..!
Fixed Deposits

Updated on: Feb 09, 2025 | 7:30 AM

దాదాపు ఐదు సంవత్సరాలలో మొదటిసారిగా ఆర్‌బీఐ ఇటీవ రెపో రేటును తగ్గించింది. దీంతో అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకుల తీసుకునే నిర్ణయం వల్ల ఇది స్థిర రాబడి కోసం ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని వివరిస్తున్నారు. ఆర్‌బీఐ ఎంపీసీ బ్యాంకులకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటు అయిన బెంచ్‌మార్క్ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. రెపో రేటు ఎఫ్‌డీ వడ్డీ రేట్లకు నేరుగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో ఏవైనా మార్పులు బ్యాంక్ నిర్ణయానికి లోబడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్‌బీఐ తన స్వల్పకాలిక రుణ రేటును ‘రెపో రేటు’గా ప్రముఖంగా పిలిచే దానిని తగ్గించినప్పుడు బ్యాంకులు ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి 

ఎఫ్‌డీలపై రేట్లను తగ్గిస్తే పెట్టుబడి పెట్టే వారు వెనుకంజ వేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ రెపో రేటు తగ్గింపునకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ రుణదాతలు త్వరలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించే అవకాశం ఉందని వివరినస్తున్నారు. బ్యాంకులు రేట్లను తగ్గించడానికి ముందే అధిక రాబడిని ఆశ్వాదించడానికి కస్టమర్లు వెంటనే ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలని వివరిస్తున్నారు. 2021లో కోవిడ్-19 ప్రభావం తర్వాత ఆర్‌బీఐ రెపో రేటును నిరంతరం పెంచడం వల్ల కస్టమర్లు చాలా కాలం పాటు ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేట్లను అందించడం మొదలుపెట్టింది. 

ఆర్‌బీఐ మే 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్య రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇటీవల అనేక బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అంచనాల మధ్య ఎఫ్‌డీ లపై వడ్డీ రేట్లను పెంచాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి మరిన్ని బ్యాంకులు అధిక రాబడిని అందిస్తున్నాయి. అలాగ రెపో రేటు తగ్గింపు గృహ రుణదాతలను ఫ్లోటింగ్-రేటు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీంతో వారికి నెలవారీ చెల్లించే ఈఎంఐల భారం కొంత మేర తగ్గనుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..