ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కొత్త వైరస్‌..! OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!

ఆండ్రాయిడ్ వినియోగదారులను భయపెడుతున్న అల్బిరియోక్స్ మాల్వేర్ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్, బ్యాంకింగ్ యాప్‌లపై ప్రభావం చూపుతోంది. ఇది ఓటీపీ లేకుండానే మీ ఫోన్ నియంత్రణను హ్యాకర్లకు అందించి, డబ్బును మాయం చేయగలదు. ఈ వైరస్ వ్యాప్తి, దాని నుంచి మీ ఆర్థిక లావాదేవీలను సురక్షితంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కొత్త వైరస్‌..! OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
Albiriox Malware

Updated on: Dec 06, 2025 | 3:56 PM

డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిపోవడంతో ఇప్పుడు ప్రతి చిన్న అవసరానికి అంతా ఫోన్‌ పే, గూగుల్‌ పే వాడుతున్నారు. అలాగే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కూడా ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనాలంటే క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌ వాడి పేమెంట్‌ చేస్తున్నారు. ఇలాంటి పేమెంట్స్‌కి ఓటీపీ వస్తేనే అమౌంట్‌ అకౌంట్ నుంచి కట్‌ అవుతుంది. అందుకే చాలా మంది డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేందుకు పెద్దగా ఆలోచించడం లేదు. ఓటీపీ లేకుండా తమ అకౌంట్‌ నుంచి డబ్బులు ఎవరూ మాయం చేయలేరనే ధీమాలో ఉన్నారు. కానీ తాజాగా ఓ వైరల్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లను భయపెడుతోంది.

అల్బిరియోక్స్ మాల్వేర్

పలు నివేదికల ప్రకారం.. అల్బిరియోక్స్ వైరస్ బ్యాంకింగ్, యూపీఐ, డిజిటల్ చెల్లింపు, ఫిన్‌టెక్, క్రిప్టో యాప్‌లలోకి కూడా చొరబడిందని కనుగొన్నారు. మీ ఫోన్ లోపలికి వెళ్ళిన తర్వాత, అది మీ బ్యాంకింగ్ యాప్‌లను నేపథ్యంలో ఆపరేట్ చేయడానికి ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ సాధనాలను ఉపయోగిస్తుంది. ఈ మాల్వేర్ మీ అనుమతి అవసరం లేకుండానే హ్యాకర్లకు పూర్తి నియంత్రణను ఇస్తుంది.

ఎలా వ్యాపిస్తోంది?

సైబర్ నేరగాళ్లు ఈ వైరస్‌ను మాల్వేర్-యాజ్-ఎ-సర్వీస్ పేరుతో అమ్ముతున్నారని, అంటే ఎవరైనా దీనికి సభ్యత్వాన్ని పొందవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, వినియోగదారులపై దాడి చేయడం ప్రారంభించవచ్చు అని నివేదికలు ఉన్నాయి.

ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి?

  • Google Play Store నుండి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి
  • మీ ఫోన్‌లో ఎప్పుడూ APKలను డౌన్‌లోడ్ చేయవద్దు
  • మీ ఫోన్ సెట్టింగ్‌ల నుండి “తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయి”ని నిలిపివేయండి.
  • కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వచ్చినప్పుడు మీ Android OS ని ఎల్లప్పుడూ అప్‌డేట్ చేయండి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి