Airtel Plans: ఎయిర్‌టెల్‌ ముందే అలర్ట్‌.. రెండు ప్లాన్స్‌ ధరలను తగ్గించింది..!

Airtel Plans: ఈ ప్లాన్‌ల ధరలను కంపెనీ ఎందుకు తగ్గించిందో ఎయిర్‌టెల్ స్పష్టం చేయలేదు. అయితే ఎయిర్‌టెల్, జియో ప్రారంభించిన కొత్త ప్లాన్‌లను పరిశోధించాలని ట్రాయ్‌ కోరడంతో ముందుగానే ఈ ప్లాన్‌ ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది. రియలన్స్‌ జియో కూడా ధరలను మార్చవచ్చు. వినియోగదారుల కోసం తొలగించబడిన..

Airtel Plans: ఎయిర్‌టెల్‌ ముందే అలర్ట్‌.. రెండు ప్లాన్స్‌ ధరలను తగ్గించింది..!

Updated on: Jan 26, 2025 | 8:56 PM

ప్రజల సౌకర్యార్థం కొత్త వాయిస్, SMS ప్లాన్‌లను ప్రారంభించాలని TRAI టెలికాం కంపెనీలను కోరింది. అయితే కంపెనీలు తెలివిగా ప్లాన్‌లను ప్రారంభించాయి. కాని ధరలను తగ్గించలేదు. అంటే, డేటాతో కూడిన ప్లాన్‌లు అదే ధరలో కంపెనీలు కేవలం కాలింగ్, SMSలతో ప్లాన్‌లను ప్రారంభించాయి. ఆ తర్వాత ట్రాయ్‌ ఆ ప్లాన్‌లను స్వయంగా పరిశీలిస్తుందని తెలిపింది. మందలించే ముందు, ఎయిర్‌టెల్ తప్పును సరిదిద్దుకుంది. రెండు ప్లాన్‌ల ధరలను రూ.110 వరకు తగ్గించింది.

ఇంతకుముందు ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌ల ధర రూ. 499, రూ. 1959. కానీ ఇప్పుడు ధర తగ్గింపు తర్వాత, ఈ ప్లాన్‌ల కొత్త ధరలు రూ.469, రూ. 1849గా మార్చింది. రెండు ప్లాన్‌లలో లభించే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

రూ. 469 ప్లాన్ వివరాలు:

ఇవి కూడా చదవండి

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.469తో కంపెనీ అపరిమిత ఉచిత కాలింగ్, 900 SMSలను అందిస్తోంది. మీరు ఈ ప్లాన్‌ని 84 రోజుల చెల్లుబాటుతో పొందుతారు. ఈ ప్లాన్ మునుపటితో పోలిస్తే రూ.30 తగ్గింది.

రూ.1849 ప్లాన్ వివరాలు:

రూ. 1849 ఎయిర్‌టెల్ ప్లాన్‌తో మీరు 365 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఇది కాకుండా, ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 SMS సౌకర్యాన్ని అందిస్తుంది. అదనపు ప్రయోజనాల గురించి మాట్లాడితే, రెండు ప్లాన్‌లతో మీరు అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, మూడు నెలల పాటు ఉచిత హెలోట్యూన్ పొందుతారు. ఈ ప్లాన్ ధర మునుపటితో పోలిస్తే రూ.110 తగ్గింది.

ధరలు ఎందుకు తగ్గాయి?

ఈ ప్లాన్‌ల ధరలను కంపెనీ ఎందుకు తగ్గించిందో ఎయిర్‌టెల్ స్పష్టం చేయలేదు. అయితే ఎయిర్‌టెల్, జియో ప్రారంభించిన కొత్త ప్లాన్‌లను పరిశోధించాలని ట్రాయ్‌ కోరడంతో ముందుగానే ఈ ప్లాన్‌ ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది. రియలన్స్‌ జియో కూడా ధరలను మార్చవచ్చు. వినియోగదారుల కోసం తొలగించబడిన ప్లాన్‌లను మళ్లీ జాబితా చేస్తుందని భావిస్తున్నారు. ఇవి ఊహాగానాలు మాత్రమే. ప్రస్తుతానికి ఈ విషయంలో జియో నుండి ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి