IPL: ఐపీఎల్ లవర్స్‌కి బంపరాఫర్‌.. రూ. 39కే ఊహకందని డేటా..

|

Mar 22, 2024 | 7:23 PM

క్రికెట్ లవర్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఐపీఎల్‌ కొత్త సీజన్‌ ప్రారంభమైంది. దీంతో ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ అంతా టీవీలకు, ఫోన్‌లకు అతుక్కుపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో మ్యాచ్‌లు వీక్షించే వారి కోసం ప్రత్యేకంగా రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొచ్చారు...

IPL: ఐపీఎల్ లవర్స్‌కి బంపరాఫర్‌.. రూ. 39కే ఊహకందని డేటా..
Ipl
Follow us on

క్రికెట్ లవర్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఐపీఎల్‌ కొత్త సీజన్‌ ప్రారంభమైంది. దీంతో ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ అంతా టీవీలకు, ఫోన్‌లకు అతుక్కుపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో మ్యాచ్‌లు వీక్షించే వారి కోసం ప్రత్యేకంగా రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొచ్చారు.

ఇందులో భాగంగా రూ. 39, రూ. 49, రూ. 79 ప్యాక్‌లను తీసుకొచ్చింది. రూ. 39తో రీఛార్జ్‌ చేసుకుంటే 20 జీబీ వరకు డేటాను పొందొచ్చు. అయితే ఇది కేవలం ఒకే రోజు వ్యాలిడిటీ ఉంటుంది. రీఛార్జ్‌ చేసుకున్న రోజు అర్థరాత్రి ప్యాక్‌ ముగుస్తుంది. ఒక్క రోజు మ్యాచ్‌ చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇక రూ. 49తో రీఛార్జ్‌ చేసుకుంటే ఒక రోజు 20 జీబీ డేటాతో పాటు 30 రోజుల పాటు వింక్‌ ప్రీమియం సభ్యత్వం ఉంది.

ఇక ఎయిర్‌ టెల్ అందిస్తోన్న మరో బెస్ట్‌ ప్యాక్‌ రూ. 79 దీంతో రీఛార్జ్‌ చేసుకుంటే 2 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ డేటా పొందొచ్చు. ఇదిలా ఉంటే ఈ ప్లాన్‌లను ఎయిర్‌టెల్‌ మార్చి 22వ తేదీ నుంచి అందుబాటలోకి తీసుకొస్తోంది. క్రికెట్ అభిమానులకు అంతరాయం లేని కనెక్టివిటీని అందించడానికి ఈ ప్లాన్స్‌ను తీసుకొచ్చామని ఎయిర్‌టెల్‌ చెబుతోంది. మ్యాచ్‌లను వీక్షించే సమయంలో డేటా సమస్య లేకుండా ఈ ప్లాన్స్‌ను పరిచయం చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..