Airtel Recharge Plans: దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్‌టెల్ అనేక రీచార్జ్ ప్లాన్స్ రన్ చేస్తుంది. రీసెంట్‌గా తన కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్స్‌లో 84 డేస్ వ్యాలిడిలీ ప్యాక్‌లు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా రోజూ 2 జీబీ డేటా పొందనున్నారు కస్టమర్లు. రిలయన్స్ జియో 84 రోజుల వాలిడిటీ ప్లాన్‌ల కంటే కూడా Airtel ప్లాన్స్ తక్కువ ధర, ఎక్కువ ప్రయోజనం అందిస్తోంది. ఎయిర్ అందిస్తున్న సరికొత్త ప్లాన్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎయిర్‌టెల్ రూ. 839 ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2GB హై స్పీడ్ డేటాను పొందుతారు. దాంతో పాటు, దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా రోజూ 100 SMS, అపరిమిత వాయిస్ కాలింగ్ అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్లాన్‌పై కస్టమర్‌లు అపరిమిత 5G డేటా, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హాలోట్యూన్, వింక్ మ్యూజిక్, రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌లను కూడా పొందుతారు.
వీటితో పాటు. మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ సదుపాయం కల్పించారు.అలాగే Airtel Xstream Play సబ్‌స్క్రిప్షన్‌ను 84 రోజుల పాటు పొందుతారు. Airtel Xstream Play సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులకు ఒకే లాగిన్‌తో ఎక్కువ కంటెంట్, 15 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ ఇస్తుంది. ఎయిర్‌టెల్ 5జీ కవరేజ్ ఏరియాలో ఉన్నవారు మాత్రమే ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను పొందుతారు. ఈ వినియోగదారులు కవరేట్ ఏరియాలో ఉంటే.. ముందుగా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ అకౌంట్‌కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
From bill payments to recharges, do it all on #AirtelThanksApp Download now!
Click https://t.co/tAl7ZDwLem to know more. pic.twitter.com/jmDHiQn0Dk
— airtel India (@airtelindia) August 8, 2023
Did you #GrabTheLOOTT?
Enjoy great deals on 18+ OTTs with Xstream Entertainment Festival.#AirtelXstreamPlayClick https://t.co/Z4Cz93UdB5 to claim your deal today! pic.twitter.com/V8jHHRB5oj
— airtel India (@airtelindia) August 3, 2023
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..