Airtel New Plan: తక్కువ ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌.. డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ పాటు ప్రతిరోజూ 2GB డేటా

|

Oct 13, 2024 | 4:35 PM

ఎయిర్‌టెల్ మార్కెట్లో అనేక ప్రీపెయిడ్ ప్యాక్‌లను విడుదల చేసింది. క్రికెట్ కేటగిరీ కోసం అలాంటి ప్రీపెయిడ్ ప్యాక్ ఒకటి తీసుకువచ్చింది. మీరు దీన్ని మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో పొందవచ్చు. ఈ ప్లాన్ అపరిమిత

Airtel New Plan: తక్కువ ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌.. డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ పాటు ప్రతిరోజూ 2GB డేటా
Airtel
Follow us on

ఎయిర్‌టెల్ మార్కెట్లో అనేక ప్రీపెయిడ్ ప్యాక్‌లను విడుదల చేసింది. క్రికెట్ కేటగిరీ కోసం అలాంటి ప్రీపెయిడ్ ప్యాక్ ఒకటి తీసుకువచ్చింది. మీరు దీన్ని మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో పొందవచ్చు. ఈ ప్లాన్ అపరిమిత 5Gతో వస్తుంది? ఇలాంటి ప్లాన్‌ల కోసం మీరు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.

మీరు కూడా ఈ ప్లాన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఈ జాబితాలోని మొదటి ప్లాన్ రూ. 549. ఇతర ప్లాన్‌లు రూ. 1029, రూ. 3999తో వస్తాయి. ఈ ప్లాన్‌లన్నీ అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS / డే అన్‌లిమిటెడ్ 5Gతో వస్తుది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కూడా AI డిటెక్షన్‌పై పని చేస్తోంది. దాని సహాయంతో స్పామ్, మోసం కాల్‌లు గుర్తిస్తోంది.

వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఇందులో లభించే ప్రయోజనాలను పొందుతారు. 549 ప్లాన్ గురించి.. అందులో మొబైల్ కోసం డిస్నీ + హాట్‌స్టార్ అందిస్తుంది. ఇది మూడు నెలల వ్యాలిడిటీతో వస్తుంది. దీనితో పాటు, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం కూడా ప్లాన్‌లో లభిస్తుంది. ఇది 22+ OTT సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. 1029 ప్లాన్‌లో 84 రోజుల చెల్లుబాటుతో వచ్చే మొబైల్ కోసం డిస్నీ + హాట్‌స్టార్ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మీరు మీ జాబితాలో రూ. 3999 ప్లాన్‌ని కూడా చేర్చవచ్చు. ఇది 1 సంవత్సరానికి వస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, వినియోగదారులకు ప్రతిరోజూ 2.5GB డేటా అందుకుంటారు. అయితే రూ. 1029 ప్లాన్‌లో, 2GB వరకు డేటా లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి