Airtel Offer: ఆక‌ట్టుకునే ఆఫ‌ర్‌తో ముందుకొచ్చిన ఎయిర్‌టెల్‌.. రూ. 100 ఫాస్ట్‌టాగ్ క్యాష్‌బ్యాక్‌తో పాటు.. మ‌రిన్ని..

|

Jun 18, 2021 | 6:15 AM

Airtel Offer: టెలికాం రంగంలో పెరుగుతోన్న పోటీ కార‌ణంగా సంస్థ‌లు వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే క్ర‌మంలో ప‌లు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌తో యూజ‌ర్ల‌ను ఆట్రాక్ట్ చేసే ఎయిర్‌టెల్ తాజాగా మ‌రో బంప‌రాఫ‌ర్‌ను...

Airtel Offer: ఆక‌ట్టుకునే ఆఫ‌ర్‌తో ముందుకొచ్చిన ఎయిర్‌టెల్‌.. రూ. 100 ఫాస్ట్‌టాగ్ క్యాష్‌బ్యాక్‌తో పాటు.. మ‌రిన్ని..
Airtel New Offer
Follow us on

Airtel Offer: టెలికాం రంగంలో పెరుగుతోన్న పోటీ కార‌ణంగా సంస్థ‌లు వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే క్ర‌మంలో ప‌లు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌తో యూజ‌ర్ల‌ను ఆట్రాక్ట్ చేసే ఎయిర్‌టెల్ తాజాగా మ‌రో బంప‌రాఫ‌ర్‌ను తీసుకొచ్చింది. ఎయిర్ టెల్ కొత్త‌గా రూ. 456 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్‌తో 60 రోజుల పాటు గ‌డువుతో అప‌రిమిత కాల్స్‌, 50 జీబీ డేటాను అందించ‌నున్నారు. అంతేకాకుండా రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు పొందొచ్చు.
ఇక ఇక్క‌డితో ఆగిపోకుండా ఈ స్పెష‌ల్ రీఛార్జ్ చేసుకున్న వారికి రూ. 100 ఫాస్ట్‌ట్యాగ్ క్యాష్‌బ్యాక్ కూడా వ‌స్తుంది. అంతేకాకుండా అమేజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిష‌న్, ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ వంటి సేవ‌ల‌ను కూడా యాక్సెస్ చేసుకోవ‌చ్చు. వీటికి 30 రోజుల కాల‌ప‌రిమితి ఉంటుంది. యూజ‌ర్లు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌, లేదా ఇత‌ర పేమెంట్ యాప్‌ల ద్వారా ఈ రీఛార్జ్‌ను చేసుకోవ‌చ్చు.

ఇదిలా ఉంటే జియో కూడా ఇలాంటి ఓ ఆఫ‌ర్‌నే తీసుకొచ్చింది. రూ.447 రీఛార్జ్ ప్లాన్‌తో తీసుకొచ్చిన ఈ ఆఫ‌ర్ ద్వారా వినియోగ‌దారుల‌కు 50 జీబీ డేటాతో పాటు అప‌రిమిత ఫోన్ కాల్స్ పొందొచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు అందిస్తారు. 60 రోజుల పాటు కాల‌ప‌రిమితి ఉంటుంది. ఇక వీటితో పాటు.. జియో టీవీ, జియో సినిమా, జీయో న్యూస్‌, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి సేవ‌ల‌ను ఉచితంగా పొందొచ్చు.

Also Read: Google Help: కరోనా కష్టకాలంలో గూగుల్‌ చేయూత.. రూ.113 కోట్ల భారీ విరాళం.. ఆక్సిజన్ల ప్లాంట్ల ఏర్పాటు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ

HDFC Bank Car Loan: ఆ పరికరాన్ని కొనుగోలు చేసిన వారందరికీ రీఫండ్; అకౌంట్‌లో జమచేస్తామన్న బ్యాంక్!

KTR’s letter to Nirmala Sitharaman : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ