టెలికం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు సరికొత్త ప్లాన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ఇటీవల జియో 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ యూజర్లను అట్రాక్ట్ చేసే క్రమంలో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. వినాయకచవితి వేళ యూజర్లు గుడ్ న్యూస్ చెబుతూ ఈ స్పెషల్ ప్యాకేజీలను ప్రకటించాయి. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్లు.. సెప్టెంబర్ 11 లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే వర్తిస్తుంది. ఇంతకీ ఏంటా ప్లాన్స్.? వాటితో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఎయిర్ టెల్ అందిస్తోన్న స్పెషల్ ప్యాకేజీల్లో రూ. 979 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 2 జీబీ డేటా పొందొచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం ద్వారా 22కిపైగా ఓటీటీ సేవలను పొందొచ్చు. అలాగే మూడు నెలల పాటు అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలోట్యూన్‌లు, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఇదే ప్లాన్‌తో 10 జీబీ డేటా పొందొచ్చు. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
* రూ. 1029తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు. 84 రోజులు వ్యాలిడిటీతో తీసుకొచ్చిన ప్లాన్‌తో 3నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సదుపాయం, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్ వంటి సేవలను పొందొచ్చు. వీటితో పాటు 10జీబీ డేటా ఉచిత కూపన్‌తో పాటు, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. వీటి వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.
* రూ. 3599తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఏడాది అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, 2జీబీ డేటా వంటి ప్రయోజనాలు పొందొచ్చు. మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్‌లు యాక్సెస్ పొందొచ్చు. ఇక ఇదే ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 10జీబీ డేటా, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం యాక్సెస్ ఇస్తోంది. వీటికి 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..