Airtel: దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ వినియోగదారులు నెట్‌వర్క్ అలాగే వైఫై సేవలు రెండూ నిలిచిపోయినట్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచీ ఎయిర్‌టెల్ సేవల్లో అంతరాయం విస్తృతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ విషయంపై ట్విట్టర్‌లో #airteldown హ్యాష్ టాగ్ తో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అవుట్‌టేజ్ ట్రాకర్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం, ఉదయం 11:12 నుంచి ఫిర్యాదులు రావడం ప్రారంభమయింది. ఉదయం 11:27 గంటల వరకు 7,000 కంటే ఎక్కువ మంది నుంచి తమ సర్వీసులు నిలిచిపోయినట్లు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ కొంతమంది వినియోగదారులు సమస్య గురించి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, కొందరు సేవలు బ్యాకప్ అయ్యాయని అయితే 20-25 నిమిషాల కంటే ఎక్కువ సమయం నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి ఎయిర్‌టెల్ సమస్య ఉన్నట్టు చెప్పింది. కానీ, ఇంకా సమస్యకు కారణం తెలియలేదని వెల్లడించింది.
వారం రోజుల కిందటే, ఎయిర్‌టెల్ ప్రత్యర్థి రిలయన్స్ జియో నెట్‌వర్క్ కూడా దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారుల నుంచి నెట్ వర్క్ డౌన్ ఫిర్యాదులు అందుకుంది. వారిలో చాలా మంది జియో నంబర్‌ల మధ్య కాల్స్ చేయలేకపోతున్నట్టు ఫిర్యాదు చేశారు.
Our internet services had a brief disruption and we deeply regret the inconvenience this may have caused you. Everything is back as normal now, as our teams keep working to deliver a seamless experience to our customers.
— airtel India (@airtelindia) February 11, 2022
No broadband connection, no mobile network and unable to use Airtel app for logging ticket. An early start to weekend ? #Airtel #AirtelDown @airtelindia
— Shubham Goel (@Shub_Goel) February 11, 2022
Airtel Fiber is down, along with their app and website. #AirtelDown@airtelindia @Airtel_Presence pic.twitter.com/XLceOgIhUZ
— Deepanshu Jain (@deepanshujn17) February 11, 2022
#AirtelDown
Neither mobile internet working nor broadband connection.
Please do something @airtelindia
Airtel apps also not opening. pic.twitter.com/Ued0iX0PDz— Hardik Prakash (@htyagi9650) February 11, 2022
Also Read: Prince Charles: ప్రిన్స్ ఛార్లెస్‌కు రెండోసారి కరోనా.. ఐసోలేషన్‌లోకి బ్రిటన్ యువరాజు..
Bus Accident: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మంది దుర్మరణం..