Air Fare: పండుగల వేళ విమాన ప్రయాణికులకు షాక్.. ఆకాశమే హద్దుగా పెరిగిపోనున్న చార్జీలు.. భారం ఎందుకంటే..

విమానంలో ప్రయాణం మరింత ప్రియం కానుంది. ఆకాశమే హద్దుగా విమాన చార్జీలు పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రయాణికుల జేబుకు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న వేళ విమాన చార్జీలు భారీగా పెరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Air Fare: పండుగల వేళ విమాన ప్రయాణికులకు షాక్.. ఆకాశమే హద్దుగా పెరిగిపోనున్న చార్జీలు.. భారం ఎందుకంటే..
Flight Tickets

Updated on: Sep 07, 2023 | 8:42 AM

విమానంలో ప్రయాణం మరింత ప్రియం కానుంది. ఆకాశమే హద్దుగా విమాన చార్జీలు పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రయాణికుల జేబుకు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న వేళ విమాన చార్జీలు భారీగా పెరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్న జెట్ ఇంధన ధరలు, గో ఫస్ట్ సంస్థ దివాళా నోటీస్ ఇవ్వడం, విమానయాన సంస్థల్లో డిమాండ్ కు తగినట్లు సీటింగ్ సదుపాయాలు లేకపోవడం వంటివి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

జెట్ ఇంధన ధరలకు రెక్కలు.. ప్రభుత్వం సెప్టెంబర్ 1న జెట్ ఇంధన ధరలను 14% పెంచింది. గత మూడు నెలల్లో ఈ ధర 26% పెరిగింది. విమానయాన సంస్థలు తమ నిర్వహణ ఖర్చులలో 40% జెట్ ఇంధనానికి ఆపాదించాయి. దీని కారణంగానే ఈ ఏడాది దసరా నవరాత్రి, దీపావళి సీజన్‌లో విమాన చార్జీలను భారీగా పెరుగతాయని నిపుణులు అంటున్నారు.

కోవిడ్ నష్టాలు.. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 2019 నాల్గో త్రైమాసికం, 2022 నాలుగో త్రైమాసికం మధ్య ఆసియా పసిఫిక్‌లో విమాన చార్జీలలో మన భారతదేశం అతిపెద్ద జంప్‌ను చూసింది. భారతదేశంలో టికెట్ల చార్జీలు అత్యధికంగా 41% పెరిగింది. తరువాత యూఏఈ 34%, సింగపూర్ 30%, ఆస్ట్రేలియా 23% మేర పెరిగాయి. గత ఆగస్టులో, రెండు సంవత్సరాల కోవిడ్ సమయంలో ప్రభుత్వం విధించిన దేశీయ విమాన చార్జీల పరిమితిని ఎత్తివేసింది. ఇది విమానయాన సంస్థలకు వారి సొంత ఛార్జీలను నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇచ్చింది. దీంతో కోవిడ్ సమయంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకొనే విధంగా విమానయాన సంస్థలు రేట్లను పెంచాయి. ఈ భారం ప్రయాణికులపై పడింది.

ఇవి కూడా చదవండి

సీటింగ్ కెపాసిటీ తక్కువ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశ దేశీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్ పరిమాణం 2023 జూలైకి 25% పెరిగి, 1.21 కోట్ల మంది ప్రయాణికులకు చేరుకుంది. పెరిగిన ఈ డిమాండ్ కు అనుగుణంగా విమానయాన సంస్థల వద్ద సీటింగ్ కెపాసిటీ లేదు. అందువల్ల విమానాల సంఖ్యను పెంచలేకపోతున్నాయి. దీంతో ఆటోమేటిక్ గా రేట్లకు రెక్కలొస్తున్నాయి.

గో ఫస్ట్ దివాలా.. ఈ సంవత్సరం మే-జూలై వేసవి ట్రావెల్ సీజన్‌లో టిక్కెట్ ధరలు బాగా పెరిగాయి. గో ఫస్ట్ అనే ఎయిర్ లైన్ సంస్థ దివాలా తీసిన తర్వాత అంటే ఆ సంస్థకు చెందిన విమానాల సస్పెన్షన్ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. గో ఫస్ట్ వదిలిపెట్టిన 300 విమానాల గ్యాప్‌ను ఇతర సంస్థలు పూరించలేదు. ఫలితంగా ప్రయాణీకులు టికెట్ల కోసం మరింత ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది.

పరిశ్రమ ఇబ్బందులు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత చమురు ధరలు పెరగడంతో విమానయాన పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. నిపుణులు తమ పూర్తి విమానాలను ఆపరేట్ చేయడం లేదు. అంతేకాక ఎయిర్‌లైన్స్‌ని నిరోధించే విడిభాగాల కొరత కూడా ఉంది. పైగా లేబర్ ఖర్చులు కూడా బాగా పెరిగాయి. వీటిన్నటి కారణంగా చార్జీలు పెరుగుతున్నాయి. పైగా ఇండిగో, గో ఫస్ట్, స్పైస్‌జెట్‌లు నిర్వహిస్తున్న ప్రాట్ అండ్ విట్నీ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌లు లోపభూయిష్టంగా ఉన్నందున గ్రౌండింగ్ చేయబడ్డాయి. వెండర్లు, రుణదాతలకు చెల్లింపులను డిఫాల్ట్ చేసినందున, గో ఫస్ట్, అత్యంత నష్టపోయి, దివాలా కోసం దరఖాస్తు చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..