
రిలయన్స్ జియో తర్వాత ఎయిర్‌టెల్ కూడా ప్రీపెయిడ్ కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. అందరు ఎక్కువగా రీఛార్జ్ చేసుకునే ప్లాన్‌ను తొలగించింది. కంపెనీ నిర్ణయంపై యూజర్లు ఫైర్ అవుతున్నారు. తక్కువ ధరతో రోజువారీ డేటాను కోరుకునే వారికి రూ.249 ప్లాన్ ఉత్తమంగా ఉండేది. ఇప్పుడు ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ నిలిపివేసింది. రూ.249 ప్లాన్‌లో ఏం అందుబాటులో ఉండేవి.. ప్రస్తుతం దాని ప్లేస్‌లో ఏ ప్లాన్ బాగుంది..? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రూ.249 ప్లాన్‌తో ప్రీపెయిడ్ వినియోగదారులు ప్రతిరోజూ 1 జీబీ హైస్పీడ్ డేటా, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందేవారు. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో ఉచిత ఎక్స్‌ట్రీమ్ ప్లే, పర్ప్లెక్సిటీ ప్రో ఏఐ, ఉచిత హలోట్యూన్ యాక్సెస్ ఉండేవి.
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో 24 రోజుల చెల్లుబాటు ప్రయోజనం ఉంది. ఈ ప్లాన్ జనవరి 2026 వరకు వినియోగదారులకు ఉచిత ఏఐ యాక్సెస్‌ను కూడా అందించింది. ఇప్పుడు రూ.249 ప్లాన్‌ను కొనుగోలు చేసే వారు రూ.299 ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రూ.249 తర్వాత ఈ శ్రేణిలో ఉన్న నెక్ట్స్ ప్లాన్ రూ.299 మాత్రమే.
రూ.299 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో కంపెనీ రోజుకు 1జీబీ హై స్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. 28 రోజుల చెల్లుబాటుతో వచ్చే ఈ ప్లాన్ స్పామ్ అలర్ట్, ఉచిత హెలోట్యూన్, పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ వంటి ప్రయోజనాలను అందిస్తుంది.
రూ.249 జియో ప్లాన్‌తో ప్రతిరోజూ 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో 28రోజుల పాటు జియో టీవీ యాక్సెస్ లభించింది. అయితే ఈ ప్లాన్‌ను జియో ఇటీవలే తొలగించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..