AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investments: బంగారం, వెండి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహనిదే.. ఇప్పుడు కొంటే మీరు కోటీశ్వరులే..

బంగారం, వెండిలో పెట్టుబడులు ఎలా పెట్టాలనేది మనందరికీ తెలుసు. ఇటీవల అనేక డిజిటల్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా సులువుగా పసిడిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. గత ఏడాదిగా ధరలు పెరగడంతో వీటిల్లో పెట్టుబడులు పెట్టినవారికి భారీగా లాభాలు వస్తున్నాయి. అయితే కాపర్‌లో పెట్టుబడి పెడితే..

Investments: బంగారం, వెండి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహనిదే.. ఇప్పుడు కొంటే మీరు కోటీశ్వరులే..
Copper
Venkatrao Lella
|

Updated on: Jun 30, 2026 | 6:45 AM

Share

గత ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో వీటిల్లో పెట్టుబడి పెట్టినవారికి భారీగా లాభాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో పసిడి ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. 2035 నాటికి తులం బంగారం రూ.3 లక్షలకు చేరుకునే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభాలు వస్తాయనే కారణంతో చాలామంది బంగారం, వెండిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత ఏడాదిలో బంగారంపై 80 శాతం రిటర్నులు రాగా.. వెండిలో పెట్టుబడి పెట్టినవారికి 170 శాతం రిటర్న్స్ వచ్చాయి. అయితే బంగారం, వెండినే కాకుండా మరో లోహంలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వచ్చే అవకాశముంది. అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

కాపర్‌లో పెట్టుబడి పెడితే లాభాలే.. లాభాలు

గోల్డ్, సిల్వర్ తర్వాత కాపర్‌లో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మరో వెండి తరహాలో కాపర్ భవిష్యత్తులో అవ్వనుందని అంటున్నారు. కాపర్‌ను వెండితో పోల్చుతున్నారు. గడిచిన ఐదేళ్లల్లో కాపర్ ధర భారీగా పెరిగింది. ఏకంగా 113 శాతం వరకు పెరిగింది. రాబోయే కొన్నేళ్లల్లో కాపర్ కోసం దేశాల మధ్య పోటీ జరిగే అవకాశముందని, రాబోయే రోజుల్లో అంత డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం క్రూడాయిల్ కోసం దేశాల మధ్య పోటీ ఉన్నట్లుగానే.. భవిష్యత్తులో కాపర్ కోసం కూడా అలాంటి పోటీ ఉంటుందని చెబుతున్నారు. దీంతో కాపర్‌లో ఇప్పుడు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో భారీగా లాభాలు వస్తాయని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఎలక్ట్రిక్ కార్లలో కాపర్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఇక ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా దీనిని వాడుతున్నారు. దీంతో వీటి వినియోగం పెరుగుతోంది. ఇక ఇటీవల ఏఐ డేటా సెంటర్లలో కాపర్ వినియోగం భారీగా పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశముంది. దీంతో కాపర్‌కు మరింత డిమాండ్ పెరగనుందని తెలుస్తోంది.

కాపర్‌లో పెట్టుబడి పెట్టడం ఎలా..?

కాపర్‌లో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కాపర్ ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. కాపర్ మైన్స్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక యూఎస్ కాపర్ ఈటీఎఫ్‌లలో కూడా భారతీయులు పెట్టుబడి పెట్టే అవకాశముంది. ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్స్, ఫ్లాట్ ఫామ్స్ లాంటివి చాలా ఉన్నాయి. సిప్ ప్రాతిపాదికన వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టినట్లుగానే కాపర్‌లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి.

Follow Us
గాయపడిన ఆటగాళ్ల ఎంపికపై కొత్త విధానం.. ఈసారి ఎందుకంటే?
గాయపడిన ఆటగాళ్ల ఎంపికపై కొత్త విధానం.. ఈసారి ఎందుకంటే?
తమలపాకు తీగకు అరుదైన పువ్వు..మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టం
తమలపాకు తీగకు అరుదైన పువ్వు..మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టం
నేపాల్‌లో చిక్కుకున్నవారి కోసం రంగంలోకి భారత రెస్క్యూ టీమ్స్!
నేపాల్‌లో చిక్కుకున్నవారి కోసం రంగంలోకి భారత రెస్క్యూ టీమ్స్!
కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే..!
కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే..!
ఎలక్ట్రిక్ వాహనంకొంటున్నారా? ఛార్జింగ్ సాకెట్ గురించి తెలుసుకోండి
ఎలక్ట్రిక్ వాహనంకొంటున్నారా? ఛార్జింగ్ సాకెట్ గురించి తెలుసుకోండి
తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..
టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..
ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్-జీ కోసం సరికొత్త వ్యూహాలు
ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్-జీ కోసం సరికొత్త వ్యూహాలు
హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు
హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు
నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ..అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్
నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ..అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్