Milk Price: అమూల్ బాటలో మరో పాల కంపెనీ.. పరాగ్ లీటర్ పాలు పెంపుదల.. ఎంత మేర పెరిగాయంటే..

|

Jun 14, 2024 | 5:17 PM

ఇప్పటికే అమూల్ కంపెనీ పాల ధరలు పెంచగా అదే బాటలో పరాగ్ మిల్క్ కూడా పయనిస్తోంది. తాజాగా పరాగ్ పాల ధరలను పెంచింది. దీంతో ఇక నుంచి ఒక లీటరు పరాగ్ పాలకు రూ.2 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కంపెనీ కి చెందిన రెండు రకాల ప్యాక్‌ల ధరల్లో పెంపుదల చేసింది. దీంతో ఇక నుంచి మార్కెట్లలో పరాగ్ టోన్డ్ మిల్క్ రూ.54కి బదులు రూ.56లకు లభ్యం కానుంది. పరాగ్ గోల్డ్ ఒక లీటర్ ధర రూ.66 నుంచి రూ.68కి పెరిగింది.

Milk Price: అమూల్ బాటలో మరో పాల కంపెనీ.. పరాగ్ లీటర్ పాలు పెంపుదల.. ఎంత మేర పెరిగాయంటే..
Parag Milk
Follow us on

ద్రవ్యోల్బణం ప్రభావం ఇప్పుడు ఆహార పదార్థాలపై ఎక్కువగా కనిపిస్తోంది. పప్పులు, ఉప్పు అనే తేడా లేకుండా అన్ని రకాల వస్తువుల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇప్పటికే అమూల్ కంపెనీ పాల ధరలు పెంచగా అదే బాటలో పరాగ్ మిల్క్ కూడా పయనిస్తోంది. తాజాగా పరాగ్ పాల ధరలను పెంచింది. దీంతో ఇక నుంచి ఒక లీటరు పరాగ్ పాలకు రూ.2 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కంపెనీ కి చెందిన రెండు రకాల ప్యాక్‌ల ధరల్లో పెంపుదల చేసింది. దీంతో ఇక నుంచి మార్కెట్లలో పరాగ్ టోన్డ్ మిల్క్ రూ.54కి బదులు రూ.56లకు లభ్యం కానుంది. పరాగ్ గోల్డ్ ఒక లీటర్ ధర రూ.66 నుంచి రూ.68కి పెరిగింది.

లీటరుకు రెండు రూపాయలు పెంపు

పరాగ్ మార్కెట్‌లో లభ్యమయ్యే 1 లీటర్ పాల ప్యాక్‌ల ధరలను పెంచినట్లు పరాగ్ డెయిరీ జీఎం వికాస్ బలియన్ తెలిపారు. దీంతో పాటు అరలీటర్ ప్యాకెట్లపై కూడా ఒక రూపాయి పెంచారు. పరాగ్ గోల్డ్ హాఫ్ లీటర్ ధర రూ.33 నుంచి రూ.34కి పెరిగింది. అంతేకాదు హాఫ్ లీటర్ పరాగ్ స్టాండర్డ్ ధర ఇప్పుడు రూ.30కి బదులుగా రూ.31గా ఉంది. అలాగే అరలీటర్ టోన్డ్ మిల్క్ ధర రూ.27కి బదులుగా ఇక నుంచి రూ.28లకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

33 వేల లీటర్ల పాలు వినియోగం

జూన్ 2న అమూల్ సహా ఇతర పాల ఉత్పత్తి కంపెనీలు ధరలు పెంచినట్లు పరాగ్ డెయిరీ జనరల్ మేనేజర్ తెలిపారు. వేడి కారణంగా పాల ఉత్పత్తి కూడా తగ్గుతోంది. పరాగ్‌ కంపెనీ నుంచి ప్రతి రోజూ దాదాపు 33 వేల లీటర్ల పాలు సరఫరా అవుతోంది. రైతులు కూడా పాల పెంచడంతో.. తమ కంపెనీ కూడా పాల ధరను పెంచాల్సి వచ్చిందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

అమూల్ పాల ధరల్లో పెంపు

అమూల్ కొత్త ధరల ప్రకారం అమూల్ గోల్డ్ హాఫ్ లీటర్ ఇప్పుడు రూ.32 నుంచి రూ.33కి పెరిగింది. అమూల్ తాజా 500 ఎంఎల్ ప్యాకెట్ ధర రూ.26 నుంచి రూ.27కి పెరిగింది. అమూల్ శక్తి 500 ఎంఎల్ ప్యాకెట్ ధర రూ.29 నుంచి రూ.30కి పెరిగింది. అముల్ తాజా చిన్న ప్యాకెట్లు మినహా అన్ని అమూల్ పాల ధరలను లీటరుకు రూ.2 మేర పెంచారు. అమూల్ గోల్డ్ 500 ml ప్యాక్ ఇప్పుడు మార్కెట్ లో రూ. 33కి అందుబాటులో ఉంటుంది. అమూల్ శక్తి ప్యాక్ రూ.30కి, అమూల్ తాజా రూ.27కి అందుబాటులో ఉన్నాయి.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..