భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం తారాస్థాయికి చేరింది. దీంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ ఇబ్బడిముబ్బడిగా మార్కెట్‌లో ఈవీ స్కూటర్లను లాంచ్ చేశాయి. కాబట్టి అన్ని కంపెనీలు మార్కెట్‌లో పెరిగిన పోటీను తట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఓలా కంపెనీ ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.15,000 వరకు విలువైన ఆఫర్లను ప్రకటించింది. ‘ఓలా ఎలక్ట్రిక్ రష్ ‘ ప్రచారంలో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లు, ఎక్స్చేంజ్ బోనస్లు అందిస్తుంది. అయితే ప్రత్యేక ఆఫర్లు జూన్ 26, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఓలా ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేయాలని ఫిక్స్ అయితే ఈ రెండు రోజుల్లో కొనుక్కోవడం ఉత్తమం. ఈ నేపథ్యంలో ఓలా ఎస్ 1 స్కూటర్లపై ఆఫర్లను ఓ సారి తెలుసుకుందాం.
ఈ స్కూటర్‌పై 5,000 ఫ్లాట్ తగ్గింపుతో పాటు క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై పై 5,000 వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసినప్పటికీ, 35,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. ముఖ్యంగా ఎంపిక చేసిన బ్యాంకుల నుంచి రుణాల పై 75,000 వరకు క్యాష్ బ్యాక్‌ను ఎంచుకోవచ్చు. ఈ స్కూటర్ ధర 89,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది
ఓలా ఎస్ 1 ఎయిర్, ఎస్1 ప్రో మోడల్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు రూ.2,999 విలువైన ఓలా కేర్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ప్యాకేజీలో భాగంగా వార్షిక సమగ్ర నిర్ధారణ, సర్వీస్ పికప్ డ్రాప్, వినియోగ వస్తువులు, దొంగతనం, రోడ్ సైడ్ అసిస్టెన్స్‌తో సహా ఉచిత సేవలను కూడా కస్టమర్లు పొందవచ్చు. అలాగే ఓలా ఎస్ 1 ఎయిర్, ఎస్ 1 ప్రో స్కూటర్లపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై 75,000 వరకు క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది. ఓలా ఎస్ 1 ఎయిర్ ధర రూ.1.05 లక్షలు కాగా, ఎస్ 1 ప్రో ధర రూ.1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
ఓలా ఎలక్ట్రిక్ 49 శాతం మార్కెట్ వాటాతో ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అగ్రగామిగా ఉంది. అలాగే కంపెనీ తన మోడల్ శ్రేణికి నవీకరణలను తీసుకువస్తోంది. ఎస్ 1 అనేది రూ.74,999 నుండి రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. ఈ స్కూటర్‌లో 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్, 4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లతో లభిస్తుంది. ఎంట్రీ-లెవల్ ఎస్1 ఎక్స్‌పై ఎలాంటి ఆఫర్లు లేవు. ఓలా ఎలక్ట్రిక్ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) జారీ చేసే ప్రక్రియలో ఉంది. కంపెనీ ఇటీవల తన డీహెచ్‌ఆర్‌పీను సెబీకు సమర్పించింది. కాబట్టి ఓలా రాబోయే నెలల్లో ఐపీఓ ప్రకటించే అవకాశం ఉంది. ఈ-స్కూటర్లతో పాటు కంపెనీ 2025 ద్వితీయార్థంలో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విభాగంలోకి ప్రవేశించనుంది. ఓలా గత ఏడాది ఆగస్టులో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కాన్సెప్ట్స్‌ను ప్రదర్శించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి